Telugu Global
NEWS

టీవీ9తో బాబుకు కొత్త సంకటం....

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మరో సంకటంలో పడబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. టీవీ9 నుంచి సీఈఓ రవిప్రకాశ్ తొలగింపు వ్యవహారం చంద్రబాబు మెడకు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టీవీ9 ప్రారంభం నుంచి కూడా టీడీపీకి అండగా ఉంటూ వచ్చిందని, దీనికి కారణం రవిప్రకాశే అని వేరే చెప్పనవసరం లేదని అంటున్నారు. సినీ నటుడు శివాజీ షేర్ల డ్రామా వెనుక కూడా చంద్రబాబు వ్యూహం ఉందనే వార్తలు వస్తున్నాయి. చంద్రబాబుకు మొదటి నుంచీ […]

టీవీ9తో బాబుకు కొత్త సంకటం....
X

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మరో సంకటంలో పడబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. టీవీ9 నుంచి సీఈఓ రవిప్రకాశ్ తొలగింపు వ్యవహారం చంద్రబాబు మెడకు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

టీవీ9 ప్రారంభం నుంచి కూడా టీడీపీకి అండగా ఉంటూ వచ్చిందని, దీనికి కారణం రవిప్రకాశే అని వేరే చెప్పనవసరం లేదని అంటున్నారు. సినీ నటుడు శివాజీ షేర్ల డ్రామా వెనుక కూడా చంద్రబాబు వ్యూహం ఉందనే వార్తలు వస్తున్నాయి. చంద్రబాబుకు మొదటి నుంచీ మీడియాను తన అదుపులో పెట్టుకోవడం అలవాటని… ఆయన ఎదుగుదల అంతా మీడియాపైనే ఆధారపడి ఉన్న విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.

1994లో చంద్రబాబు మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యాడు. దీని వెనుక కూడా మీడియా మేనేజ్ మెంట్ ఉందనేది కాదనలేని సత్యమని చెబుతున్నారు. 2004లో సీఎం పదవి నుంచి దిగిపోయే సమయం వరకు కూడా ఆయన మీడియాను శాసించారని చెబుతున్నారు.

ఇక విభజన తరువాత ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మీడియా పట్ల తన పాత పద్ధతులనే పునరావృతం చేశారని అంటున్నారు.

రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ క్రమంగా బలం పుంజుకోవడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనాదరణ పెరగడం గమనించిన బాబు మీడియాను మరింత విస్తృతంగా వాడుకోవాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.

గతంలో తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేశారంటూ ఒక ప్రముఖ చానల్ నుంచి సీనియర్ జర్నలిస్టును తొలగింపజేసిన విషయం కూడా తెలిసిందేనని అంటున్నారు. ఈ క్రమంలోనే టీవీ9ను కూడా చంద్రబాబు పూర్తిగా వాడుకుంటున్నందు వల్లే రవిప్రకాశ్ కు అండగా ఉండేందుకే శివాజీని రంగంలోకి దించి ఉండవచ్చని చెబుతున్నారు.

అసలు టీవీ9 యాజమాన్యం చేతులు మారడం ఇష్టం లేని బాబు తెర వెనుక రవిప్రకాష్ కు అండగా నిలిచారని అంటున్నారు. అయితే, రవిప్రకాశ్ మీద వచ్చిన ఆరోపణలు నిజమే అని రుజువు అయితే గనుక భవిష్యత్తులో చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయనేది రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట.

కోర్టులతో ఆడుకోవడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అనేది అందరికీ తెలిసిన విషయమే. టీవీ9 విషయంలోనూ నటుడు శివాజీ, రవిప్రకాష్ లతో షేర్ల డ్రామా ఆడించి…. సీన్ కోర్టుకు చేరేలాగా చూసి…. స్టేటస్ కో తో కొన్నేళ్ళపాటు లాగించాలని చూశారని…. అయితే టీవీ9ను కొన్న రామేశ్వర్ రావు వెనుక బాబుకు బాబు లాంటి వ్యక్తులు ఉండడంతో ఇక కథ నడవలేదని కొందరంటున్నారు.

First Published:  10 May 2019 4:44 AM IST
Next Story