మాజీ ఐఏఎస్‌కు జగన్ కీలక పదవి ఇవ్వబోతున్నారా..?
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఇంకా రెండు వారాలు సమయం ఉంది. ఇప్పటికే అత్యధిక సర్వేలు ఎవరు గెలువబోతున్నారో విశ్లేషణలు చేశాయి. అంతే కాకుండా జగన్ కీలక బృందంలో ఎవరెవరు ఉంటారనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తిరమైన వార్త రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వైసీపీకి మెజార్టీ వచ్చి వైఎస్ జగన్ సీఎం అయితే మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లమ్‌ను ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమిస్తారని ఆ వార్త సారాంశం. గతంలో […]
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఇంకా రెండు వారాలు సమయం ఉంది. ఇప్పటికే అత్యధిక సర్వేలు ఎవరు గెలువబోతున్నారో విశ్లేషణలు చేశాయి. అంతే కాకుండా జగన్ కీలక బృందంలో ఎవరెవరు ఉంటారనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తిరమైన వార్త రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
వైసీపీకి మెజార్టీ వచ్చి వైఎస్ జగన్ సీఎం అయితే మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లమ్‌ను ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమిస్తారని ఆ వార్త సారాంశం. గతంలో ఏపీ ముఖ్య కార్యదర్శిగా అజయ్ కల్లమ్ పని చేశారు. అంతే కాక రాష్ట్రం ప్రభుత్వంలోని కీలకమైన ఆర్థిక, రెవెన్యూ, వైద్యారోగ్య శాఖల్లో కీలక పదవులు నిర్వర్తించారు.
దీంతో ఆయనను ముఖ్య సలహాదారుగా నియమించుకుంటే జగన్‌కు కీలక సమయంలో అందుబాటులో ఉంటారని భావిస్తున్నారు. ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్‌కు కొత్తైన జగన్ పక్కన అజయ్ కల్లమ్ ఉంటే పాలనను సజావుగా నడిపించే అవకాశం ఉంటుందని భావించడం వల్లే ఆ కీలక పోస్టుకు ఆయనను నియమించే అవకాశం ఉంది.