హాటు కేకుల్లా ఐపీఎల్ ఫైనల్స్ టికెట్లు
రెండు నిముషాలలో ఐపీఎల్ ఫైనల్స్ టికెట్లు సేల్ హైదరాబాద్ వేదికగా 12న ఐపీఎల్ టైటిల్ ఫైట్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈనెల 12న జరిగే…ఐపీఎల్ ఫైనల్స్ టికెట్ల విక్రయంలో బీసీసీఐ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఫైనల్స్ టికెట్ల సేల్ ప్రారంభమైన 120 సెకన్లలోనే ముగియటం విశేషం. ఆన్ లైన్ ద్వారా ఫైనల్స్ టికెట్ల విక్రయం మొదలు పెట్టిన రెండు నిముషాల వ్యవధిలోనే..హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియంలో 39వేల సీటింగ్ […]
- రెండు నిముషాలలో ఐపీఎల్ ఫైనల్స్ టికెట్లు సేల్
- హైదరాబాద్ వేదికగా 12న ఐపీఎల్ టైటిల్ ఫైట్
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈనెల 12న జరిగే…ఐపీఎల్ ఫైనల్స్ టికెట్ల విక్రయంలో బీసీసీఐ సరికొత్త రికార్డు నమోదు చేసింది.
ఫైనల్స్ టికెట్ల సేల్ ప్రారంభమైన 120 సెకన్లలోనే ముగియటం విశేషం. ఆన్ లైన్ ద్వారా ఫైనల్స్ టికెట్ల విక్రయం మొదలు పెట్టిన రెండు నిముషాల వ్యవధిలోనే..హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి.
హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియంలో 39వేల సీటింగ్ సామర్థ్యం ఉంది. అయితే…ఎన్ని టికెట్లు…ఎంత ధరకు విక్రయిస్తారన్న సమాచారాన్ని నిర్వాహక సంఘం ముందుగా ఇవ్వకపోడంతో గందరగోళం ఏర్పడింది.
సాధారణంగా 25 వేల నుంచి 30 వేల వరకూ టికెట్లు మాత్రమే విక్రయిస్తారు. అయితే…ఐపీఎల్ ఫైనల్స్ కు ఎన్ని టికెట్లు విక్రయానికి ఉంచిందీ.. బీసీసీఐ ముందుగా ప్రకటించకపోడం విశేషం.
చుక్కల్లో టికెట్ల ధరలు…
ఐపీఎల్ ఫైనల్స్ టికెట్ల ధరలు చూస్తే…కరుడుగట్టిన అభిమానులకు సైతం కళ్లు బైర్లు కమ్మటం ఖాయం. కనీస టికెట్ ధరను 1000 రూపాయలుగా, అత్యధిక టికెట్ ధరను 22వేల 500 రూపాయలుగా ఖరారు చేశారు.
1000, 1500, 2000, 2500, 5వేలు, 10వేలు, 12వేల 500, 15వేలు, 22 వేల 500 రూపాయల ధరలతో విక్రయించారు. ఇదంతా చూస్తుంటే…సగటు క్రికెట్ అభిమానికి ఐపీఎల్ అందని ద్రాక్ష అనడంలో ఏమాత్రం సందేహం లేదు.