Telugu Global
NEWS

మూడేళ్ల తర్వాత క్లే కోర్టు టెన్నిస్ లో ఫెదరర్

మాడ్రిడ్ ఓపెన్ లో ఫెదరర్ తొలిగెలుపు 2019 ఫ్రెంచ్ ఓపెన్ కు ఫెదరర్ సన్నాహాలు టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్, గ్రాండ్ స్లామ్ కింగ్, గ్రాస్ కోర్ట్ టెన్నిస్ లో బాస్ రోజర్ ఫెదరర్ …మూడేళ్ల విరామం తర్వాత తిరిగి క్లే కోర్టు టెన్నిస్ టోర్నీలో పాల్గొన్నాడు. పారిస్ వేదికగా ఈనెల ఆఖరి వారంలో ప్రారంభమయ్యే ఫ్రెంచ్ ఓపెన్ కు సన్నాహాలలో భాగంగా…ఫెదరర్…మాడ్రిడ్ ఓపెన్ బరిలో నిలిచాడు. తొలిరౌండ్లో ఫ్రెంచ్ ఆటగాడు రిచర్డ్ గాస్కేను ఫెదరర్ వరుస సెట్లలో […]

మూడేళ్ల తర్వాత క్లే కోర్టు టెన్నిస్ లో ఫెదరర్
X
  • మాడ్రిడ్ ఓపెన్ లో ఫెదరర్ తొలిగెలుపు
  • 2019 ఫ్రెంచ్ ఓపెన్ కు ఫెదరర్ సన్నాహాలు

టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్, గ్రాండ్ స్లామ్ కింగ్, గ్రాస్ కోర్ట్ టెన్నిస్ లో బాస్ రోజర్ ఫెదరర్ …మూడేళ్ల విరామం తర్వాత తిరిగి క్లే కోర్టు టెన్నిస్ టోర్నీలో పాల్గొన్నాడు.

పారిస్ వేదికగా ఈనెల ఆఖరి వారంలో ప్రారంభమయ్యే ఫ్రెంచ్ ఓపెన్ కు సన్నాహాలలో భాగంగా…ఫెదరర్…మాడ్రిడ్ ఓపెన్ బరిలో నిలిచాడు.

తొలిరౌండ్లో ఫ్రెంచ్ ఆటగాడు రిచర్డ్ గాస్కేను ఫెదరర్ వరుస సెట్లలో చిత్తు చేయడం ద్వారా శుభారంభం చేశాడు. కేవలం 52 నిముషాలలోనే…6-2, 6-3తో ఫెదరర్ విజేతగా నిలిచాడు.

2016 మే 12న రోమ్ ఓపెన్ మూడోరౌండ్లో డోమనిక్ థీమ్ చేతిలో ఓటమి పొందిన ఫెదరర్ ఆ తర్వాత మూడేళ్లపాటు క్లే కోర్టు టెన్నిస్ కు దూరంగా ఉన్నాడు.

మూడుసార్లు మాడ్రిడ్ విన్నర్ ఫెదరర్

ఫెదరర్ కు మాడ్రిడ్ ఓపెన్ లో మూడుసార్లు విజేతగా నిలిచిన రికార్డు ఉంది. 2006, 2009, 2012 సంవత్సరాలలో మాడ్రిడ్ టైటిల్స్ సొంతం చేసుకొన్న ఫెదరర్ మరోసారి టైటిల్ నెగ్గాలన్న పట్టుదలతో ఉన్నాడు. రిచర్డ్ గాస్కేతో ఇప్పటి వరకూ 21సార్లు తలపడిన ఫెదరర్ 18-3 రికార్డుతో తన ఆధిపత్యం నిలుపుకొన్నాడు.

తన సుదీర్ఘ కెరియర్ లో ఫెదరర్ సాధించిన మొత్తం 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ లో ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్‌ టైటిల్ మాత్రమే ఉండటం విశేషం.

First Published:  8 May 2019 3:05 PM IST
Next Story