ఓవర్సీస్ లో ఈసారి మహేష్ స్థానం ఏంటి?
మహర్షి అనేది కేవలం ఓ సినిమా మాత్రమే కాదు, మహేష్ స్టామినాకు ఓ పరీక్ష. అతడి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది. పైగా మహేష్ కెరీర్ లో 25వ సినిమా. దాదాపు 140 కోట్ల రూపాయలకు అమ్మిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే బ్లాక్ బస్టర్ అవ్వాలి. లేదంటే మహేష్ కు మరో ఫ్లాప్ గ్యారెంటీ. ఇదిలా ఉండగా మహేష్ కోసం అటు ఓవర్సీస్ లో కూడా పలు రికార్డులు ఎదురుచూస్తున్నాయి. బాహుబలి-2, […]
మహర్షి అనేది కేవలం ఓ సినిమా మాత్రమే కాదు, మహేష్ స్టామినాకు ఓ పరీక్ష. అతడి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది. పైగా మహేష్ కెరీర్ లో 25వ సినిమా. దాదాపు 140 కోట్ల రూపాయలకు అమ్మిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే బ్లాక్ బస్టర్ అవ్వాలి. లేదంటే మహేష్ కు మరో ఫ్లాప్ గ్యారెంటీ.
ఇదిలా ఉండగా మహేష్ కోసం అటు ఓవర్సీస్ లో కూడా పలు రికార్డులు ఎదురుచూస్తున్నాయి. బాహుబలి-2, రంగస్థలం, అజ్ఞాతవాసి రికార్డుల కంటే వెనకబడి ఉండడంతో ఈసారి మహేష్ తన సత్తా చాటాల్సిన సమయం వచ్చింది. మరీ ముఖ్యంగా యూఎస్ లో మొదటి రోజు వసూళ్ల (ప్రీమియర్స్ తో కలుపుకొని) లో మహేష్ కాస్త వెనకబడి ఉన్నాడు. ముందు ఈ రికార్డు బద్దలుకొట్టాలి. ఏ రికార్డు సృష్టించాలన్నా దానికి పునాది ఫస్ట్ డే కలెక్షన్ మాత్రమే.
ఓవర్సీస్ మొదటి రోజు వసూళ్లలో బాహుబలి-2 మొదటి స్థానంలో ఉంది. దాన్ని అధిగమించడం దాదాపు అసాధ్యం. దీని తర్వాత స్థానంలో అజ్ఞాతవాసి ఉంది. కాస్త ట్రై చేస్తే దీన్ని టచ్ చేయొచ్చు. మహర్షి సినిమాతో మహేష్ ఈ మార్క్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి. ఇక ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన టాప్-10 చిత్రాలు ఇలా ఉన్నాయి.
- బాహుబలి-2 – 4.2 మిలియన్ డాలర్లు
- అజ్ఞాతవాసి – 1.52 మిలియన్ డాలర్లు
- బాహుబలి – 1.36 మిలియన్ డాలర్లు
- ఖైదీ నంబర్ 150 – 1.29 మిలియన్ డాలర్లు
- స్పైడర్ – 1.05 మిలియన్ డాలర్లు
- భరత్ అనే నేను – 8 లక్షల 50వేల డాలర్లు
- అరవింద సమేత – 7 లక్షల 97 వేలు డాలర్లు
- రంగస్థలం – 7 లక్షల 6వేల డాలర్లు
- సర్దార్ గబ్బర్ సింగ్ – 6 లక్షల 16వేల డాలర్లు
- జై లవకుశ – 5 లక్షల 89 వేల డాలర్లు