Telugu Global
National

ప్రాంతీయం... అధికారంలో జాతీయం !

దేశ వ్యాప్తంగా ఐదో దశ పోలింగ్ ముగిసింది. ఇక రెండు దశలలోనే పోలింగ్ మిగిలి ఉంది. ఇప్పటి వరకు నాలుగు వందలు పైచిలుకు స్దానాలలో ఎన్నికలు ముగిసాయి. ఇక మిగిలిన రెండు దశలలోను 150 స్దానాలకు మాత్రమే పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకూ జరిగిన ఐదు దశల పోలింగ్ ను గమనిస్తే అధికార భారతీయ జనతా పార్టీకి ఏమంత కలిసి వచ్చినట్లు కనిపించడం లేదు. ఈ ఐదు దశలలోను కలిపి బిజేపీకి 150 స్థానాలలోపే వస్తాయని అంచనా […]

ప్రాంతీయం... అధికారంలో జాతీయం !
X

దేశ వ్యాప్తంగా ఐదో దశ పోలింగ్ ముగిసింది. ఇక రెండు దశలలోనే పోలింగ్ మిగిలి ఉంది. ఇప్పటి వరకు నాలుగు వందలు పైచిలుకు స్దానాలలో ఎన్నికలు ముగిసాయి. ఇక మిగిలిన రెండు దశలలోను 150 స్దానాలకు మాత్రమే పోలింగ్ జరగనుంది.

ఇప్పటి వరకూ జరిగిన ఐదు దశల పోలింగ్ ను గమనిస్తే అధికార భారతీయ జనతా పార్టీకి ఏమంత కలిసి వచ్చినట్లు కనిపించడం లేదు. ఈ ఐదు దశలలోను కలిపి బిజేపీకి 150 స్థానాలలోపే వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే ఎక్కువ స్దానాలు దక్కించుకోవచ్చునంటున్నారు. అయితే ఈ రెండు పార్టీలు కూడా ఒంటరిగా అధికారాన్ని చేపట్టే అవకాశం లేదంటున్నారు. దీంతో దేశంలోని ప్రాంతీయ పార్టీలదే పైచేయిగా కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి హవా కొనసాగుతోంది. అలాగే తమిళనాడులో డిఎంకే, పశ్చిమ బెంగల్ లో తృణమూల్ కాంగ్రెస్, ఒడిశాలో బిజేడి ఇక మిగిలిన రాష్ట్రాలలోని ఎస్పీ, బిఎస్పీ వంటి ప్రాంతీయ పార్టీలే జాతీయ స్దాయిలో కీలక పాత్ర పోషించనున్నాయి.

ఒక రాష్ట్రానికే పరిమితమైన ఈ పార్టీలు జాతీయ రాజకీయాలను శాసించడం, ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్, బిజేపీలకు ముచ్చేమటలు పట్టించడం ఈ ఎన్నికలలో విశేషం. ఈ నెల 23 ఫలితాల తరువాత దేశ ప్రధాని ఎవరు? ఏ పార్టీ అధికార పగ్గాలు చేపడుతుంది? అనేక కీలక అంశాలను ప్రాంతీయ పార్టీలే నిర్ణయించనున్నాయి.

First Published:  8 May 2019 2:55 AM IST
Next Story