Telugu Global
NEWS

కేసీఆర్ చేసిన ఈ పనికి అంతా షాక్ అయ్యారు....

‘ఓటు వజ్రాయుద్ధం.. అందరూ ఓటేయాలి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి..’ సాధారణంగా ఈ నినాదాలు ఎన్నికలు వచ్చినప్పుడు వినపడతాయి. ఓటేయని వారిని కడిగేసే వారు ఎందరో.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో 39శాతం మంది మాత్రమే ఓటేశారు. దీనిపై అన్ని చానళ్లు డిబేట్లు పెట్టి కడిగేశాయి. ఇక ఏపీలో అయితే ఓటరు చైతన్యం మామూలుగా లేదు.. 89శాతం వరకూ కొన్ని నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు 80శాతానికి పైగా ఓటుహక్కు చాలా నియోజకవర్గాల్లో నమోదైంది.. చైతన్యానికి మారుపేరుగా […]

కేసీఆర్ చేసిన ఈ పనికి అంతా షాక్ అయ్యారు....
X

‘ఓటు వజ్రాయుద్ధం.. అందరూ ఓటేయాలి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి..’ సాధారణంగా ఈ నినాదాలు ఎన్నికలు వచ్చినప్పుడు వినపడతాయి. ఓటేయని వారిని కడిగేసే వారు ఎందరో.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో 39శాతం మంది మాత్రమే ఓటేశారు. దీనిపై అన్ని చానళ్లు డిబేట్లు పెట్టి కడిగేశాయి.

ఇక ఏపీలో అయితే ఓటరు చైతన్యం మామూలుగా లేదు.. 89శాతం వరకూ కొన్ని నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు 80శాతానికి పైగా ఓటుహక్కు చాలా నియోజకవర్గాల్లో నమోదైంది.. చైతన్యానికి మారుపేరుగా ఏపీ ప్రజలు నిలిచారు.

ఇక తెలంగాణలోని జిల్లాల్లో ప్రజలు బాగానే స్పందించారు. కానీ ఇప్పుడు పరిషత్ ఎన్నికల వేళ అందరిలోనూ నిరాసక్తత. ఓటు వేయడానికి బద్దకం ఆవహించింది. స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేయలేదు. ఆయన కేరళ పర్యటన పెట్టుకొని తన స్వగ్రామం చింతమడకకు వెళ్లలేదని టీఆర్ఎస్ శ్రేణులు చెప్పుకొస్తున్నా.. దాన్ని ఎవ్వరూ పాజిటివ్ గా తీసుకోవడం లేదు.

‘ఒక సీఎంకే ఓటు హక్కు వేయాలన్న పట్టింపు లేదని.. ఇక ప్రజలెలా ఓటేస్తారంటూ’ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ గొప్పలు చెప్పే కేసీఆర్ దాన్ని పాటించరా అంటూ విమర్శిస్తున్నారు.

First Published:  7 May 2019 11:20 PM GMT
Next Story