Telugu Global
NEWS

ఐపీఎల్ ఎలిమినేటర్ రౌండ్ ఫైట్ కి కౌంట్ డౌన్

విశాఖ వేదికగా రాత్రి 8 గంటలకు పోరు  ఇటు ఢిల్లీ క్యాపిటల్స్- అటు హైదరాబాద్ సన్ రైజర్స్  లీగ్ టేబుల్ 3, 4 స్థానాలలో నిలిచిన ఢిల్లీ, హైదరాబాద్ ఐపీఎల్ 12వ సీజన్ ప్లేఅఫ్ రౌండ్లో ఓ ఆసక్తికరమైన పోరుకు విశాఖలోని ఆంధ్ర క్రికెట్ సంఘం స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఎలిమినేటర్ రౌండ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో హైదరాబాద్ సన్ రైజర్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఎనిమిదిజట్ల డబుల్ రౌండ్ […]

ఐపీఎల్ ఎలిమినేటర్ రౌండ్ ఫైట్ కి కౌంట్ డౌన్
X
  • విశాఖ వేదికగా రాత్రి 8 గంటలకు పోరు
  • ఇటు ఢిల్లీ క్యాపిటల్స్- అటు హైదరాబాద్ సన్ రైజర్స్
  • లీగ్ టేబుల్ 3, 4 స్థానాలలో నిలిచిన ఢిల్లీ, హైదరాబాద్

ఐపీఎల్ 12వ సీజన్ ప్లేఅఫ్ రౌండ్లో ఓ ఆసక్తికరమైన పోరుకు విశాఖలోని ఆంధ్ర క్రికెట్ సంఘం స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఎలిమినేటర్ రౌండ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో హైదరాబాద్ సన్ రైజర్స్ అమీతుమీ తేల్చుకోనుంది.
ఎనిమిదిజట్ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో జరిగిన మొత్తం 14 రౌండ్ల మ్యాచ్ ల్లో…ఢిల్లీ 14 రౌండ్లలోల 9 విజయాలతో 18 పాయింట్లు సాధించడం ద్వారా మూడోస్థానంలో నిలిచింది.

మరోవైపు…హైదరాబాద్ సన్ రైజర్స్ 14 రౌండ్లలో 6 విజయాలు మాత్రమేసాధించి..12 పాయింట్లతో ..మెరుగైన రన్ రేట్ తో..
అనూహ్యంగా క్వాలిఫైయర్స్ రౌండ్ చేరుకోగలిగింది.

రెండో క్వాలిఫైయర్స్ రౌండ్లో చోటు కోసం జరిగే ఎలిమినేటర్ రౌండ్లో… శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని ఢిల్లీ జట్టే హాట్ ఫేవరెట్ గా
పోటీకి దిగుతోంది.

పృధ్వీ షా, రిషబ్ పంత్ లాంటి యువఆటగాళ్లతో కూడిన ఢిల్లీ 2012 తర్వాత ప్లే ఆఫ్ రౌండ్ కు అర్హత సాధించిన జోష్ తో పోటీకి దిగుతోంది.

మరోవైపు… అపార అనుభవం ఉన్న కేన్ విలియమ్స్ సన్ నాయకత్వంలోని హైదరాబాద్ సన్ రైజర్స్ స్థాయికి తగ్గట్టుగా ఆడగలిగితే.. ఢిల్లీకి కష్టాలు తప్పవు.

పరుగుల గని విశాఖ పిచ్…

బ్యాటింగ్ కు అనువుగా ఉండే విశాఖ స్టేడియం పిచ్ పైన 180కి పైగా స్కోరు సాధించిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయి.
టాస్ నెగ్గిన జట్టు ముందుగా బ్యాటింగ్ కే మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు.

ఐపీఎల్ చరిత్రలోనే విశాఖ వేదికగా జరుగుతున్న ఈ అతిపెద్ద సమరం కోసం స్టీల్ సిటీ అభిమానులు ఎక్కడలేని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

ఏసీఎ- విశాఖ స్టేడియం లోని టికెట్లన్నీ ఇప్పటికే హాటుకేకుల్లా అమ్ముడు పోయినట్లు నిర్వాహక సంఘం చెబుతోంది.
ఎలిమినేటర్ రౌండ్లో నెగ్గిన జట్టు…మే 10న విశాఖ వేదికగానే జరిగే రెండో క్వాలిఫైయర్స్ రౌండ్లో…డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడాల్సి ఉంది.

First Published:  8 May 2019 3:05 AM IST
Next Story