Telugu Global
NEWS

పోలవరంపై బాంబు పేల్చిన ఉండవల్లి.... అంత ఘోరమా?

పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రాజెక్ట్ గా బాబు చెప్పుకుంటున్నారు. తెగ ఊదరగొడుతున్నారు. కానీ అక్కడ పరిస్థితి మాత్రం ఏదో తేడా కొడుతోంది. ప్రాజెక్టు ప్రాంతంలో భూమి పగుళ్లతో…. భూకంపం వచ్చినట్టుగా విచ్చుకుపోతోంది. ఒకవేళ ప్రాజెక్ట్ పూర్తయ్యాక అలా జరిగితే నిల్వ ఉన్న నీరు సమీప గ్రామాలనే కాదు…. రాజమండ్రి పట్టణమే నామరూపాల్లేకుండా మునిగిపోయే ప్రమాదం ఉంది. ఇలా జనాల ప్రాణాలను ఫణంగా పెట్టి అడ్డదిడ్డంగా పోలవరం కడుతున్న బాబు తీరుపై తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ […]

పోలవరంపై బాంబు పేల్చిన ఉండవల్లి.... అంత ఘోరమా?
X

పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రాజెక్ట్ గా బాబు చెప్పుకుంటున్నారు. తెగ ఊదరగొడుతున్నారు. కానీ అక్కడ పరిస్థితి మాత్రం ఏదో తేడా కొడుతోంది. ప్రాజెక్టు ప్రాంతంలో భూమి పగుళ్లతో…. భూకంపం వచ్చినట్టుగా విచ్చుకుపోతోంది.

ఒకవేళ ప్రాజెక్ట్ పూర్తయ్యాక అలా జరిగితే నిల్వ ఉన్న నీరు సమీప గ్రామాలనే కాదు…. రాజమండ్రి పట్టణమే నామరూపాల్లేకుండా మునిగిపోయే ప్రమాదం ఉంది. ఇలా జనాల ప్రాణాలను ఫణంగా పెట్టి అడ్డదిడ్డంగా పోలవరం కడుతున్న బాబు తీరుపై తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పోలవరం నిర్మాణ ప్రాంతంలో భూమి గుల్లబారి ఉంది. ప్రాజెక్ట్ నిర్మాణం సమయంలో పగుళ్లు ఏర్పడుతున్నాయి. ప్రమాదకర స్థితిలోకి ప్రాజెక్ట్ వెళుతోంది. భవిష్యత్ లో ఏమాత్రం తేడా వచ్చి డ్యాం కూలిపోతే రాజమండ్రి మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఉండవల్లి ఆధారాలతో సహా వివరిస్తున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం గొప్పలకు పోయి ప్రాజెక్టు రక్షణ బాధ్యతను పెడచెవిన పెడుతోంది. నిపుణులను పంపి పరీశీలిస్తే ప్రాజెక్టు నాణ్యత, నిలబడుతుందా లేదా అనేది తెలుస్తుంది. పోలవరం విషయంలో చాలా దారుణాలు జరుగుతున్నాయని అక్కడి అధికారులే స్వయంగా చెబుతున్నారు.

కొత్తగా కాపర్ డ్యాం కడుతానంటున్న బాబు దీనికోసం 30వేల కోట్లు ఎక్కడ నుంచి తెస్తాడని ఉండవల్లి ప్రశ్నించారు. ఇక ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలా న్యాయం చేస్తాడని కోరుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల బాగోగులు దృష్టిలో పెట్టుకొని డిజైన్ మారిస్తే అందరికీ మంచిదని ఉండవల్లితో సహా అందరూ సూచిస్తున్నారు.

First Published:  7 May 2019 2:32 PM IST
Next Story