టైగర్ వుడ్స్ కు అరుదైన గౌరవం
ట్రంప్ చేతుల మీదుగా పురస్కారం గ్లోబల్ గేమ్ గోల్ఫ్ లో ఆల్ టైమ్ గ్రేట్ టైగర్ వుడ్స్ అరుదైన గౌరవం సాధించాడు. ప్రపంచ గోల్ఫ్ లో తిరుగులేని మొనగాడిగా పేరుపొందిన టైగర్ వుడ్స్ ఆ తర్వాత వివాహేతర సంబంధాలతో కెరియర్ కు దూరమయ్యాడు. వ్యక్తిగతంగా ఆటుపోట్లు చవిచూసినా పడిలేచిన కెరటంలా దూసుకొచ్చాడు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి తిరిగి కెరియర్ కొనసాగించాడు. కొద్దిరోజుల క్రితమే ముగిసిన మాస్టర్స్ టోర్నీలో తుదివరకూ పోరాడి విజేతగా నిలిచాడు. 5 సంవత్సరాల విరామం తర్వాత ఓ […]
- ట్రంప్ చేతుల మీదుగా పురస్కారం
గ్లోబల్ గేమ్ గోల్ఫ్ లో ఆల్ టైమ్ గ్రేట్ టైగర్ వుడ్స్ అరుదైన గౌరవం సాధించాడు. ప్రపంచ గోల్ఫ్ లో తిరుగులేని మొనగాడిగా పేరుపొందిన టైగర్ వుడ్స్ ఆ తర్వాత వివాహేతర సంబంధాలతో కెరియర్ కు దూరమయ్యాడు. వ్యక్తిగతంగా ఆటుపోట్లు చవిచూసినా పడిలేచిన కెరటంలా దూసుకొచ్చాడు.
ప్రతికూల పరిస్థితులను అధిగమించి తిరిగి కెరియర్ కొనసాగించాడు. కొద్దిరోజుల క్రితమే ముగిసిన మాస్టర్స్ టోర్నీలో తుదివరకూ పోరాడి విజేతగా నిలిచాడు. 5 సంవత్సరాల విరామం తర్వాత ఓ ప్రపంచ స్థాయి టైటిల్ సాధించడం ద్వారా తానేమిటో నిరూపించుకొన్నాడు. తన కెరియర్ లో సాధించిన మేజర్ టైటిల్స్ సంఖ్యను 15కు పెంచుకొన్నాడు.
అమెరికా ప్రభుత్వ ప్రతిష్టాత్మక పురస్కారం అమెరికన్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం గౌరవాన్ని సంపాదించాడు. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ చేతుల మీదుగా మెడల్ స్వీకరించాడు. పామర్, జాక్ నికోలస్, చార్లీ స్టిఫోర్డ్ ల సరసన టైగర్ వుడ్స్ నిలిచాడు.
వైట్ హౌస్ లో వేడుకగా ముగిసిన కార్యక్రమంలో ట్రంప్ స్వయంగా మెడల్ బహూకరించారు. విజయం..విజయం..రాజీలేని పోరాటం అన్న అమెరికా స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచాడని కొనియాడారు.