Telugu Global
NEWS

కేసీఆర్, బాబుకు మే 23 తర్వాతే తెలుస్తుందేమో....

మే 23 కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైతే గాలిలో మేడలు కడుతున్నారు. తాహతుకు మించి దేశరాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. అయితే వీరి సీట్లను, స్థాయిని పరిశీలిస్తే మాత్రం వీరిది అత్యాశే అనకమానరు.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత 16సీట్లపై కన్నేశారు. సర్వేల ప్రకారం అయన 12 సీట్ల వరకు గెలవచ్చు. ఇక ఏపీలో బాబు పరిస్థితి మాత్రం మరీ తీసికట్టుగా ఉంది. ఆయన కేవలం ఐదారు సీట్లకు మించి గెలవరంటున్నారు. మరి వీరిద్దరూ […]

కేసీఆర్, బాబుకు మే 23 తర్వాతే తెలుస్తుందేమో....
X

మే 23 కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైతే గాలిలో మేడలు కడుతున్నారు. తాహతుకు మించి దేశరాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. అయితే వీరి సీట్లను, స్థాయిని పరిశీలిస్తే మాత్రం వీరిది అత్యాశే అనకమానరు..

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత 16సీట్లపై కన్నేశారు. సర్వేల ప్రకారం అయన 12 సీట్ల వరకు గెలవచ్చు. ఇక ఏపీలో బాబు పరిస్థితి మాత్రం మరీ తీసికట్టుగా ఉంది. ఆయన కేవలం ఐదారు సీట్లకు మించి గెలవరంటున్నారు. మరి వీరిద్దరూ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి రెడీ అయ్యారు. దేశంలోని 270 సీట్లకు పైగానే వస్తే ప్రభుత్వం ఫామ్ అవుతుంది. 16 సీట్లతో కేసీఆర్, ఐదారు సీట్లతో చంద్రబాబు దేశాన్ని ఎలా ఏలుతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

కేసీఆర్ తాజాగా దక్షిణాది బాటపట్టారు. ఫెడరల్ ఫ్రంట్ లో కమ్యూనిస్టులను భాగస్వామ్యం చేయాలని కేరళ సీఎంను ఆహ్వానించారు. ఇక బాబు కేంద్రంలో కాంగ్రెస్ తో జట్టుకట్టి ప్రాంతీయ పార్టీలను మచ్చి చేసుకుంటున్నారు. వీరిద్దరి బలం తక్కువైనా బలగాన్ని ఎక్కువగా ఊహించుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ లేదా బీజేపీ వస్తే ఓకే.. లేదంటే కేసీఆర్, బాబులతోపాటు మమత, అఖిలేష్ సహా చాలా మంది ప్రాంతీయ పార్టీలు కీలకమవుతాయి. ఏకంగా ప్రధాని పదవిపై కన్నేస్తాయి. కానీ తక్కువ సీట్లు ఉన్న బాబు, కేసీఆర్ లకు ఆ పదవి దక్కడం కష్టమే.

First Published:  7 May 2019 10:30 AM IST
Next Story