Telugu Global
National

ప్రచారం వరకే చంద్రబాబు...!

జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకుంటున్న చంద్రబాబు ఆశలకు గండి పడేటట్టుగా ఉంది. ఏ ఎండకు ఆ గొడుగు పడతారనే పేరున్న చంద్రబాబును మిగిలిన పార్టీలు నమ్మె పరిస్థితి కనిపించడం లేదు. ఆయన గత చరిత్ర తెలిసిన పార్టీ నాయకులు ఎవరూ చంద్రబాబు చివరి వరకూ తోడుంటారని నమ్మడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు చంద్రబాబు నాయుడిని కేవలం ప్రచారానికే పరిమితం చేశారని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాదికి చెందిన రాష్ట్రాల నాయకులు […]

ప్రచారం వరకే చంద్రబాబు...!
X

జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకుంటున్న చంద్రబాబు ఆశలకు గండి పడేటట్టుగా ఉంది. ఏ ఎండకు ఆ గొడుగు పడతారనే పేరున్న చంద్రబాబును మిగిలిన పార్టీలు నమ్మె పరిస్థితి కనిపించడం లేదు.

ఆయన గత చరిత్ర తెలిసిన పార్టీ నాయకులు ఎవరూ చంద్రబాబు చివరి వరకూ తోడుంటారని నమ్మడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు చంద్రబాబు నాయుడిని కేవలం ప్రచారానికే పరిమితం చేశారని నిర్ణయించినట్లు చెబుతున్నారు.

ముఖ్యంగా ఉత్తరాదికి చెందిన రాష్ట్రాల నాయకులు ఎవరూ చంద్రబాబుతో చివరి వరకూ ప్రయాణించడానికి సుముఖంగా లేరని అంటున్నారు. ప్రచారానికి మాత్రమే చంద్రబాబు ను వినియోగించుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.

గతంలో మతతత్వ పార్టీ అంటూ బిజేపీపై విరుచుకుపడిన చంద్రబాబు ఆ తర్వాత వారితో చేతులు కలపడాన్ని గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు గురించి తెలిసిన వారు ఎవరైనా ఆయనతో చేతులు కలిపేందుకు సందేహిస్తారని అంటున్నారు.

చంద్రబాబు ప్రచారం కారణంగా వివిధ రాష్ట్రాలలో ఉండే తెలుగువారి ఓట్లు పడతాయన్న ఆశతోనే ఆయనను ప్రచారానికి తీసుకువస్తున్నారని, అది కూడ లేకపోతే చంద్రబాబును పట్టించుకునే వారే ఉండరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో చంద్రబాబును ప్రచారానికి పరిమితం చేసి తాము ఓట్లు పొందాలన్నది ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకుల ఆలోచనగా చెబుతున్నారు.

First Published:  7 May 2019 2:36 PM IST
Next Story