Telugu Global
Health & Life Style

బీట్ రూట్.... ఆరోగ్యానికి క్లీన్ చిట్....

ప్రకృతి దేవుడిచ్చిన వరం. ప్రకృతిలో సహజంగా పండే కూరగాయలు, పళ్లు, ఇతర ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో దుంప జాతికి చెందిన బీట్ రూట్ కు చాలా ప్రత్యేకత ఉంది. ఇది ఆరోగ్యంతో పాటు… సౌంద్యర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. ఆ విశేషాలేంటో తెల్సుకుందాం. బీట్ రూట్ లో ఫొలిక్ యాసిడ్ నిల్వలు అధికంగా ఉన్నాయి. ఇవి స్త్రీల సంతానోత్పత్తికి ఎంతో మేలు చేస్తాయి. గర్భవతులు తప్పనిసరిగా ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకోవాలని వైద్యులు […]

బీట్ రూట్.... ఆరోగ్యానికి క్లీన్ చిట్....
X

ప్రకృతి దేవుడిచ్చిన వరం. ప్రకృతిలో సహజంగా పండే కూరగాయలు, పళ్లు, ఇతర ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో దుంప జాతికి చెందిన బీట్ రూట్ కు చాలా ప్రత్యేకత ఉంది. ఇది ఆరోగ్యంతో పాటు… సౌంద్యర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. ఆ విశేషాలేంటో తెల్సుకుందాం.

  • బీట్ రూట్ లో ఫొలిక్ యాసిడ్ నిల్వలు అధికంగా ఉన్నాయి. ఇవి స్త్రీల సంతానోత్పత్తికి ఎంతో మేలు చేస్తాయి. గర్భవతులు తప్పనిసరిగా ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకోవాలని వైద్యులు సూచిస్తారు. సంతాన సాఫల్యత కోసం బీట్ రూట్ మంచి ఔషధం.
  • అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ప్రతిరోజు బీట్ రూట్ జ్యూస్ తీసుకుంటే రక్తపోటు అదుపులోకి వస్తుంది.
  • చిన్న పిల్లల ఎదుగుదలకు పోషకాహారం చాలా అవసరం.. బీట్ రూట్ లో కావాల్సినన్ని పోషకాలు ఉన్నాయి. తరచూ చిన్న పిల్లల చేత బీట్ రూట్ జ్యూస్ తాగిస్తే వారి ఎదుగుదల బాగుంటుంది.
  • వయసుతో పాటు వచ్చే మతిమరుపునకు బీట్ రూట్ జ్యూస్ మంచి మందు. మెదడులో రక్తప్రసారం పెరిగి చురుగ్గా ఉంటారు.
  • బీట్ రూట్ లో ఉన్న నైట్రేడ్స్ రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు తోడ్పడుతాయి. రక్తనాడులు చురుగ్గా పని చేసేందుకూ సహాయ పడుతుంది.
  • బీట్ రూట్ జ్యూస్ లివర్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది.
  • బీట్ రూట్ లో కొవ్వు శాతం అతి తక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు పెరిగేందుకు అవకాశం లేదు. ఆహార నియంత్రణ లేదా ఆహార నియమాలను పాటిస్తున్న వారు బీట్ రూట్ ప్రతిరోజూ తీసుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు.
  • బీట్ రూట్ ఎనర్జీ బూస్టర్ లా పనిచేస్తుంది. తక్షణ శక్తి కోసం, ఉల్లాసం, ఉత్తేజం కోసం ఒక చిన్న గ్లాసు బీట్ రూట్ జ్యూస్ చాలు.
  • రక్తహీనత, ఎనీమియా కు బీట్ రూట్ దివ్యౌషధం. తరచూ బీట్ రూట్ జ్యూస్ తాగితే కొత్త రక్తం పడుతుంది.
First Published:  6 May 2019 2:35 AM IST
Next Story