Telugu Global
NEWS

అసోం యువక్రికెటర్ రియాన్ కలనిజమాయెగా!

నాటి బుల్లి అభిమాని.. నేటి సహఆటగాడు అప్పుడు తండ్రిని, ఇప్పుడు తనయుడిని అవుట్ చేసిన ధోనీ రియాన్ పరాగ్…17 ఏళ్ల ఈ అసోం యువక్రికెటర్…12 ఏళ్ల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది. 2019 ఐపీఎల్ సీజన్లో….తన అభిమాన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా రియాన్ పరాగ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అంతేకాదు..అదే మ్యాచ్ లో ధోనీ పట్టిన క్యాచ్ కు రియోన్ 16 పరుగుల వ్యక్తిగత […]

అసోం యువక్రికెటర్ రియాన్ కలనిజమాయెగా!
X
  • నాటి బుల్లి అభిమాని.. నేటి సహఆటగాడు
  • అప్పుడు తండ్రిని, ఇప్పుడు తనయుడిని అవుట్ చేసిన ధోనీ

రియాన్ పరాగ్…17 ఏళ్ల ఈ అసోం యువక్రికెటర్…12 ఏళ్ల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది. 2019 ఐపీఎల్ సీజన్లో….తన అభిమాన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా రియాన్ పరాగ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.

అంతేకాదు..అదే మ్యాచ్ లో ధోనీ పట్టిన క్యాచ్ కు రియోన్ 16 పరుగుల వ్యక్తిగత స్కోరుకు అవుటయ్యాడు. ధోనీ చేతిలో అవుట్ కావడం ద్వారా ఓ అరుదైన రికార్డులో భాగస్వామిగా మారాడు.

12 ఏళ్ల క్రితం టీమిండియా కెప్టెన్ గా ఉన్న ధోనీని కలిసిన సమయంలో రియాన్ పరాగ్ వయసు కేవలం ఐదేళ్లు మాత్రమే. గౌహతీ వేదికగా 2007లో పాకిస్థాన్ తో ముగిసిన వన్డే మ్యాచ్ తర్వాత… ధోనీని ఓ బుల్లి అభిమాని కలసి..ఓ ఫోటో దిగాడు. ఆ అభిమానే నేటి యువఆటగాడు రియాన్ పరాగ్.

2007లో ధోనీతో కలసి ఓ అభిమానిగా ఫోటో దిగిన రియాన్…12 ఏళ్ల విరామం తర్వాత…ఐపీఎల్ లో ఓ సహక్రికెటర్ హోదాలో అదే ధోనీతో ఫోటో దిగి మురిసిపోయాడు.

అసోం జట్టుకు గతంలో ఓపెనర్ గా ఆడిన పరాగ్ దాస్ కుమారుడే రియాన్ పరాగ్. బాల్యం నుంచి తనతండ్రి ఆటను చూస్తూ పెరిగిన రియాన్…క్రికెట్ పట్ల ఆకర్షితుడయ్యాడు. తండ్రి ప్రేరణతో అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగాడు. 2018 జూనియర్ ప్రపంచకప్ లో పాల్గొన్న భారత జట్టులో కీలకసభ్యుడిగా నిలిచాడు.

2018-19 విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో అసోం తరపున రియోన్ ఆడిన ఏడుమ్యాచ్ ల్లో 248 పరుగులు సాధించాడు. అంతేకాదు…20 లక్షల రూపాయల కనీసధరతో…జైపూర్ ఫ్రాంచైజీలో చేరాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా …ఐపీఎల్ మ్యాచ్ లు ఆడే అరుదైన అవకాశం సొంతం చేసుకొన్నాడు.

ఏప్రిల్ 11న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా రియాన్ పరాగ్ ఐపీఎల్ అరంగేట్రం ద్వారా ధోనీతో కలసి మ్యాచ్ ఆడటమే కాదు…ధోనీ పట్టిన క్యాచ్ కు అవుటయ్యాడు.

అప్పుడు తండ్రి…ఇప్పుడు కొడుకు….

1999-2000 రంజీ సీజన్లో భాగంగా జరిగిన మ్యాచ్ లో…బీహార్ జట్టులో వికెట్ కీపర్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీతో…అసోం జట్టు ఓపెనర్ గా రియాన్ పరాగ్ తండ్రి పరాగ్ దాస్ కలసి ఆడారు.. ఆ మ్యాచ్ లో…పరాగ్ దాస్ ను …ధోనీ స్టంపౌట్ గా పడగొట్టాడు.

ఆ తర్వాత 12 ఏళ్లకు…పరాగ్ దాస్ తనయుడు రియాన్ పరాగ్ ను సైతం…ధోనీ క్యాచ్ అవుట్ గా పెవీలియన్ దారి పట్టించాడు. క్రికెట్ చరిత్రలో తండ్రిని, కొడుకును అవుట్ చేసిన వికెట్ కీపర్ గా ధోనీ రికార్డుల్లో చేరాడు.

First Published:  3 May 2019 10:57 PM GMT
Next Story