Telugu Global
Cinema & Entertainment

మహర్షి సెన్సార్.... ఈ సినిమా కూడా పెద్దదే

సినిమా నిడివి పెరిగితే ఇన్నాళ్లలా మేకర్స్ పెద్దగా భయపడ్డం లేదు. ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వస్తుందేమో అనే అనుమానాలు పెట్టుకోవడం లేదు. ఎందుకంటే అర్జున్ రెడ్డి, మహానటి, రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు ఈ అపోహల్ని తొలిగించాయి. అందుకే మహర్షి యూనిట్ కూడా రన్ టైమ్ పెరిగినా ధీమాగా ఉంది. ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తిచేసుకుంది. ఎలాంటి కట్స్ చెప్పకుండా U/A సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ అధికారులు. సినిమా నిడివి అన్నీ కలుపుకొని 2 […]

మహర్షి సెన్సార్.... ఈ సినిమా కూడా పెద్దదే
X

సినిమా నిడివి పెరిగితే ఇన్నాళ్లలా మేకర్స్ పెద్దగా భయపడ్డం లేదు. ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వస్తుందేమో అనే అనుమానాలు పెట్టుకోవడం లేదు. ఎందుకంటే అర్జున్ రెడ్డి, మహానటి, రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు ఈ అపోహల్ని తొలిగించాయి. అందుకే మహర్షి యూనిట్ కూడా రన్ టైమ్ పెరిగినా ధీమాగా ఉంది.

ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తిచేసుకుంది. ఎలాంటి కట్స్ చెప్పకుండా U/A సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ అధికారులు. సినిమా నిడివి అన్నీ కలుపుకొని 2 గంటల 48 నిమిషాలుంది. ఇది కాస్త ఎక్కువ రన్ టైమ్ కిందే చెప్పుకోవాలి. ట్రిమ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ మేకర్స్ మాత్రం ఆ పనిచేయలేదు. దీనికి కారణం ఎమోషనల్ కంటెంట్.

మహర్షి సినిమా మొత్తం ఒకెత్తు, ఆఖరి అరగంట మరో ఎత్తు. చివరి 30 నిమిషాలు ప్రతి ప్రేక్షకుడు భావోద్వేగంతో కదిలిపోతాడని, కొంతమంది కన్నీళ్లు కూడా పెట్టుకుంటారని ఛాలెంజ్ చేసి మరీ చెబుతున్నారు దర్శకుడు, నిర్మాత. అలాంటి కంటెంట్ ను కట్ చేస్తే, ఎమోషన్ చెడిపోతుందనే ఉద్దేశంతో నిడివి ఎక్కువైనా అలానే ఉంచేశారట.

పోనీ క్లైమాక్స్ కాకుండా తొలి అర్ధభాగంలో ఏదైనా కట్ చేద్దామంటే, స్టోరీ మొత్తం మాంటేజ్ సాంగ్స్ రూపంలో నడిచిందట. ఎక్కడా సన్నివేశాలు పడకుండా, బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్ తో ఎక్కువ సన్నివేశాలు నడిచాయట. సో.. అలాంటి మాంటేజ్ సాంగ్స్ ను కట్ చేయలేం. సో.. ఏదైతే అదే జరుగుతుందనే ధైర్యంతో కాస్త ఎక్కువ రన్ టైమ్ తోనే థియేటర్లలోకి వస్తున్నాడు మహర్షి.

First Published:  4 May 2019 7:44 AM IST
Next Story