Telugu Global
NEWS

కేసీఆర్ కొత్త కేబినెట్ లో ఉండేది వీళ్లేనట....

ఎన్ని విమర్శలొచ్చినా.. ఎందరు దుమ్మెత్తి పోసినా తెలంగాణ సీఎం కేసీఆర్ తీరు మారడం లేదు. ఆయన అనుకున్నదే చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అఖండ మెజార్టీ ఇవ్వడంతో తాను చేసేవన్నీ కరెక్టేనన్న ధీమాతో కేసీఆర్ మరోసారి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అయినట్టు సమాచారం. 2014 ఎన్నికల్లో కేసీఆర్ బోటాబోటీ మెజార్టీతోనే గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ కు కేవలం 2 సీట్లు మాత్రమే అధికంగా సాధించారు. దీంతో ప్రభుత్వ సుస్థిరత పేరిట తెలంగాణలో గెలిచిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలను […]

కేసీఆర్ కొత్త కేబినెట్ లో ఉండేది వీళ్లేనట....
X

ఎన్ని విమర్శలొచ్చినా.. ఎందరు దుమ్మెత్తి పోసినా తెలంగాణ సీఎం కేసీఆర్ తీరు మారడం లేదు. ఆయన అనుకున్నదే చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అఖండ మెజార్టీ ఇవ్వడంతో తాను చేసేవన్నీ కరెక్టేనన్న ధీమాతో కేసీఆర్ మరోసారి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అయినట్టు సమాచారం.

2014 ఎన్నికల్లో కేసీఆర్ బోటాబోటీ మెజార్టీతోనే గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ కు కేవలం 2 సీట్లు మాత్రమే అధికంగా సాధించారు. దీంతో ప్రభుత్వ సుస్థిరత పేరిట తెలంగాణలో గెలిచిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లోకి లాగారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన తలసాని, ఇంద్రకరణ్ రెడ్డిలకు ఏకంగా మంత్రి పదవులను కట్టబెట్టారు.

అయితే 2019లో మాత్రం ఆ పరిస్థితి రాలేదు. కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అఖండ మెజార్టీని సాధించిపెట్టారు. కేసీఆర్ పక్కచూపులు చూసేందుకు అవకాశం ఇవ్వలేదు. అయినా కేసీఆర్ కు సంతృప్తి లేదు. గద్దెనెక్కగానే 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేశారు. టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యేను చేర్చుకున్నారు..

ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఓ మహిళా ఎమ్మెల్యేకి, టీడీపీ నుంచి గెలిచి కారెక్కిన ఎమ్మెల్యేకు మంత్రి పదవులు ఖాయం చేస్తున్నారన్న వార్త తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పెంచింది. ఇంత గెలుపు వచ్చినా ఇంకా ఇతర పార్టీల వారిని చేర్చుకోవడమే మహా ఎక్కువ అంటే ఇప్పుడు వారికి మంత్రి పదవులు కూడా ఇస్తూ మరోసారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడన్న అపఖ్యాతిని మూటకట్టుకుంటున్నారు.

First Published:  4 May 2019 12:08 AM GMT
Next Story