Telugu Global
National

పని చేయడం అంటే పనే చేయడం.... ఫొని తుఫానును సమర్థవంతంగా ఎదుర్కున్న నవీన్ పట్నాయక్

ఆ మధ్య తిత్లీ, హుద్ హుద్ తుఫాన్లు ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాలను గడగడలాడించాయి. ఏపీ సీఎం చంద్రబాబు తన క్యారావాన్‌లోనే పడుకొని హడావిడి చేశారు. తుఫాను బాధిత ప్రాంతాలకు తిరుగుతూ తన వెంటే అధికారులను కూడా తిప్పుకున్నారు. అత్యవసర సమయంలో బాధితులకు సహాయక, పునరావాస చర్యలను చేపట్టవలసిన అధికారులు సీఎం చంద్రబాబు వెంట ఉండటంతో వాళ్లు కూడా ఏ పనీ చేయలేకపోయారు. దీంతో వేలాది మంది ప్రజలకు ప్రభుత్వ పరంగా అత్యవసర సమయంలో అందాల్సిన సహాయం […]

పని చేయడం అంటే పనే చేయడం.... ఫొని తుఫానును సమర్థవంతంగా ఎదుర్కున్న నవీన్ పట్నాయక్
X

ఆ మధ్య తిత్లీ, హుద్ హుద్ తుఫాన్లు ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాలను గడగడలాడించాయి. ఏపీ సీఎం చంద్రబాబు తన క్యారావాన్‌లోనే పడుకొని హడావిడి చేశారు. తుఫాను బాధిత ప్రాంతాలకు తిరుగుతూ తన వెంటే అధికారులను కూడా తిప్పుకున్నారు. అత్యవసర సమయంలో బాధితులకు సహాయక, పునరావాస చర్యలను చేపట్టవలసిన అధికారులు సీఎం చంద్రబాబు వెంట ఉండటంతో వాళ్లు కూడా ఏ పనీ చేయలేకపోయారు. దీంతో వేలాది మంది ప్రజలకు ప్రభుత్వ పరంగా అత్యవసర సమయంలో అందాల్సిన సహాయం అందకుండా పోయింది.

రెండు రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు ఏకధాటిగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎడతెగక వీడియో కాన్ఫరెన్సులను నిర్వహిస్తున్నారంటూ పత్రికల్లో అచ్చేసుకున్నారు. కాని ఫొని తుఫాను సమయంలో ఒక రాష్ట్ర అధినేత చేయాల్సింది కాన్ఫరెన్సులా..? ఈ ఫొని తుఫానును సమర్థవంతంగా ఎదుర్కున్న బీద రాష్ట్రమైన ఒడిషా గురించి ‘ది న్యూయార్క్ టైమ్స్’ ఒక కథనం రాసింది. క్షేత్ర స్థాయి అధికారులను వారి పని వారిని చేసుకోనిస్తూ.. తాను ఏం చేయాలో అది చేసిన ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ గురించి కూడా ఈ కథనంలో రాశారు. ఆ కథనంలో ఏం చెప్పారో కాస్త చెప్పుకుందాం.

1999లో ఒడిషాలో భీకరమైన తుఫాను బీభత్సం సృష్టించింది. ఆనాటి నుంచే ఆ రాష్ట్రంలో తుఫాను, వరదల నుంచి ఎదుర్కోవడానికి క్షేత్ర స్థాయి నుంచి శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు అదే ఫొని తుఫానును ఎదుర్కోవడానికి నవీన్ పట్నాయక్ సర్కారుకు దోహదపడింది. తుఫాను రావడానికి ముందే దాదాపు 12 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

అంత త్వరగా ఎలా తరలించారంటే….

ఫొని తుఫాను ముందుగా శ్రీలంక, ఇండోనేషియా మధ్యన బంగాళాఖాతం, హిందూమహాసముద్రంలో అల్పపీడనంగా మొదలైంది. దీని గురించి భారత వాతావరణ శాఖ ముందుగానే అంచనా వేసి ఆ అల్పపీడనం బలపడితే వాయుగుండంగా మారి, తుఫానుగా మారుతుందని చెప్పింది. ఒడిషా రాష్ట్రం ఈ హెచ్చరికలను పరిగణనలోనికి తీసుకుంది. ఎప్పటికప్పుడు తుఫాను గమనాన్ని అంచనా వేస్తు..హెచ్చరికలు జారీ చేసింది.

పూరీ సమీపంలో తుఫాను తీరాన్ని దాటడానికి ముందే రాష్ట్రంలో తుఫాను ప్రభావిత ప్రాంతలకు సంబంధించిన సమాచారాన్ని పంపింది. దాదాపు 28 లక్షల ఎస్ఎంఎస్‌లను పంపింది. 43 వేల వాలంటీర్లను, వెయ్యి మంది అత్యవసర సిబ్బందిని అప్రమత్తం చేసింది. అంతే కాకుండా టీవీలు, రేడియోల ద్వారా ఎప్పటికప్పుడు తుఫాను గురించిన విషయాలను ప్రజలకు చేరేలా చేసింది. భీకరమైన తుఫాను మన రాష్ట్రానికి రానుంది అందరూ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ముందుగానే హెచ్చరించింది.

ఈ విషయంలో నవీన్ పట్నాయక్ ఎక్కడా తలదూర్చలేదు. కేవలం తాను చేయాల్సిన పనిని మాత్రమే చేసి మిగతా చర్యలు తీసుకోవడానికి సీనియర్ అధికారులను పురమాయించారు. దేశంలోనే పేదరికంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన ఒడిషా ఇంత సమర్థవంతంగా భీకరమైన ఫొని తుఫానును ఎదుర్కోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇది నవీన్ పట్నాయక్ సాధించిన విజయమేనని అందరూ ప్రశంసిస్తున్నారు.

గతంలో ఒడిషా ఎదుర్కున్న తుఫానులను, ప్రస్తుత ఫొని తుఫానును చూసిన మాజీ నావల్ అధికారి అభిజిత్ సింగ్ మాట్లాడుతూ.. ఇది నిజంగా ఘనమైన విజయం, తుఫానును సమర్థవంతంగా ఎదుర్కున్నారని చెప్పారు.

20 ఏళ్ల క్రితం ఒడిషా తుఫాను వల్ల నష్టపోయిన దానితో పోల్చుకుంటే.. ఈ ఫొని తుఫాను విషయంలో విజయం సాధించినట్లే అని అందరూ అంటున్నారు. ప్రాణనష్టం లేకుండా ఇంత సమర్థవంతంగా తుఫానును ఎదుర్కోవడం ఒక్క రోజుతో అయిన పని కాదని.. దాదాపు 20 ఏళ్లుగా ఒడిషా చేసిన కృషే అని బిష్ణుపాద సేథి వ్యాఖ్యానించారు.

ఒడిషాలో అత్యధిక మంది ప్రజలు తీర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారికి సముద్రమే జీవనాధారం. తుఫాను సమయంలో వారి జీవనాధారాన్ని కోల్పోవడమే కాకుండా ఒక్కో సారి ప్రాణాలకు కూడా ముప్పు కలుగుతుంది. అలాంటి వారిని ముందుగానే గుర్తించి వారికి తుఫాను సమయంలో ఎలా వ్యవహరించాలో ముందుగానే చెప్పారు. అందువల్లే అంత మందిని తక్కువ సమయంలోనే పునరావాస కేంద్రాలకు తరలించగలిగారు. ఫొని తుఫాను విషయంలో నిజంగా ఒడిషా రాష్ట్రం, సీఎం నవీన్ పట్నాయక్ విజయం సాధించినట్లే.

మరో వైపు సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న ఏపీ.. తుఫానులు వచ్చిన ప్రతీసారి నష్టాల పాలవుతోంది. తుఫాను బాధితులకు సరైన సమయంలో సమాచారం ఇవ్వడం, వారిని పునరావాస కేంద్రాలకు తరలించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీఎం చంద్రబాబు ఆకస్మిక పర్యటనలు చేస్తూ తన మీడియా ద్వారా ఏదో చేశామనే ప్రచారం చేయించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికీ తిత్లీ, హుద్ హుద్ బాధితులకు నష్టపరిహారం అందలేదంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

First Published:  4 May 2019 5:17 AM GMT
Next Story