వైసీపీ గూటికి ఇద్దరు టీడీపీ మంత్రులు?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడానికి మరో 20 రోజుల సమయం ఉంది. కాని ఇప్పటికే అనేక విశ్లేషణలు వైసీపీకి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్లలో గుబులు మొదలైందని చెబుతున్నారు. ఇన్ని రోజులూ అధికారం అనుభవించి… ఇప్పుడు అధికారానికి దూరం అవడం కష్టంగా ఉంటుందని మాట్లాడుకుంటున్నారట. ఫలితాల సంగతి పక్కన పెడితే చంద్రబాబు రోజుకో రకంగా ప్రకటనలు చేయడం సొంత పార్టీ నేతలకే మింగుడు పడటం లేదంటున్నారు. దీంతో ఇద్దరు మంత్రులు పార్టీని […]
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడానికి మరో 20 రోజుల సమయం ఉంది. కాని ఇప్పటికే అనేక విశ్లేషణలు వైసీపీకి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్లలో గుబులు మొదలైందని చెబుతున్నారు. ఇన్ని రోజులూ అధికారం అనుభవించి… ఇప్పుడు అధికారానికి దూరం అవడం కష్టంగా ఉంటుందని మాట్లాడుకుంటున్నారట.
ఫలితాల సంగతి పక్కన పెడితే చంద్రబాబు రోజుకో రకంగా ప్రకటనలు చేయడం సొంత పార్టీ నేతలకే మింగుడు పడటం లేదంటున్నారు. దీంతో ఇద్దరు మంత్రులు పార్టీని వీడాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఒక మంత్రితో పాటు, పశ్చిమ గోదావరి జిల్లా మంత్రి కూడా వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఎన్నికలకు ముందే వీరిద్దరూ పార్టీ మారాలని ప్రయత్నించారట. కానీ పార్టీలో చేరినా టికెట్ ఇవ్వడం కుదరదని వైఎస్ జగన్ తెగేసి చెప్పారట. అంతే కాకుండా, అప్పుడు యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని బుజ్జగింపుల కమిటీ వీరి ప్రయత్నాలను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అప్పటికైతే వాళ్లు పార్టీ మారకుండా ఆగారు. కానీ ఇప్పుడు మాత్రం వెళ్లిపోవడానికే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఏదేమైనా ఎన్నికల ఫలితాలు రాకముందే ఇతర పార్టీ నేతలు వైసీపీ వైపు చూస్తున్నారంటే….. ఫలితాలు వైపీసీకి అనుకూలంగా ఉంటే ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.