Telugu Global
NEWS

ఏపీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి ఓవర్ యాక్షన్.... బదులివ్వని అధికారులు..!

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ‘ఫొని’ తుపాను బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను ఉపసంహరించుకుంది. తుపాను బాధితులందరికీ పునరావాసం, సహాయక చర్యలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాగా, తుపాను వల్ల పంట నష్టాలు జరుగుతాయి… అదే విధంగా రైతులకు జరిగే నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ వ్యవసాయ శాఖ […]

ఏపీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి ఓవర్ యాక్షన్.... బదులివ్వని అధికారులు..!
X

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ‘ఫొని’ తుపాను బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను ఉపసంహరించుకుంది. తుపాను బాధితులందరికీ పునరావాసం, సహాయక చర్యలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కాగా, తుపాను వల్ల పంట నష్టాలు జరుగుతాయి… అదే విధంగా రైతులకు జరిగే నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి సమీక్షలు నిర్వహించుకోవడానికి ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరారు. ఫొని తుపాను నేపథ్యంలో ఆయనకు వ్యవసాయ సంబంధిత చర్యలకు అనుమతి ఇచ్చారు.

అయితే, తెలుగుదేశం పార్టీకి చెందిన సోమిరెడ్డి ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫొని తుపాను సమీక్షకు ఉపయోగించాల్సిన సమయాన్ని ఆయన రాజకీయంగా వినియోగించుకున్నట్లు తెలిసింది. ఈ సమీక్ష నిర్వహించిన సమయంలో ఉన్న మీడియా వ్యక్తుల్లో ఒకరు ఈ విషయమై ప్రశ్నించగా ఆయన సమాధానం దాటవేశారు.

ఆ పక్కనే ఉన్న అధికారులు కూడా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించగా మంత్రి వారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ మంత్రులు ఇలా కఠినంగా వ్యవహరించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫొని తుపాను నేపథ్యంలో ఉత్తర కోస్తా ప్రాంతంలో తీవ్రమైన నష్టం కలుగుతుంటే.. ఒక వ్యవసాయ మంత్రి ఇలా స్పందించడంపై పలు విమర్శలు వస్తున్నాయి.

First Published:  3 May 2019 2:26 PM IST
Next Story