Telugu Global
Cinema & Entertainment

పూజాకు.... అడిగినంతా ఇచ్చారట ...!

అప్పటిదాకా హోమ్లీ పాత్రల్లో కనిపించిన పూజా హెగ్డే ఉన్నట్టుండి ‘డీజే’ సినిమాతో రూటు మార్చింది. అప్పటినుంచి ఈమె పై ఆఫర్ల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు అందరు స్టార్ హీరోలతో వరుసపెట్టి సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే …. తన రెమ్యునరేషన్ ని కూడా భారీగా పెంచేసిందట. తాజాగా ఈమెను సంప్రదించిన ప్రొడ్యూసర్ కి తన రెమ్యూనరేషన్ తో షాక్ ఇచ్చిందట. ఈ మధ్యనే ‘ఎఫ్ 2’  తో బ్లాక్ బస్టర్ అందుకున్న వరుణ్ తేజ్ […]

పూజాకు.... అడిగినంతా ఇచ్చారట ...!
X

అప్పటిదాకా హోమ్లీ పాత్రల్లో కనిపించిన పూజా హెగ్డే ఉన్నట్టుండి ‘డీజే’ సినిమాతో రూటు మార్చింది. అప్పటినుంచి ఈమె పై ఆఫర్ల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే.

దాదాపు అందరు స్టార్ హీరోలతో వరుసపెట్టి సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే …. తన రెమ్యునరేషన్ ని కూడా భారీగా పెంచేసిందట. తాజాగా ఈమెను సంప్రదించిన ప్రొడ్యూసర్ కి తన రెమ్యూనరేషన్ తో షాక్ ఇచ్చిందట.

ఈ మధ్యనే ‘ఎఫ్ 2’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం తమిళ సినిమా ‘జిగర్తాండ’ రీమేక్ అయిన వాల్మీకి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అధర్వ మురళి మరియు వరుణ్ తేజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందు కొత్త అమ్మాయిని తీసుకుందామనుకున్నప్పటికీ ఆ తర్వాత పూజా హెగ్డే ని సంప్రదించారట. కేవలం 15 రోజులు షూటింగ్ కోసం ఆమె ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేయడంతో దర్శక నిర్మాతలు షాక్ అయ్యారట.

అయినప్పటికీ అంత భారీ మొత్తాన్ని ఇచ్చి…. పూజా హెగ్డే ను ఈ సినిమాకు ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. 14రీల్స్ పతాకం నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

First Published:  3 May 2019 8:09 AM IST
Next Story