Telugu Global
NEWS

సన్ రైజర్స్ కు ముంబై ఇండియన్స్ షాక్

హైదరాబాద్-ముంబై జట్ల మ్యాచ్ టై  ఎలిమినేటర్ ఓవర్ తో నెగ్గిన ముంబై ప్లే ఆఫ్ రౌండ్లో ముంబై బెర్త్ ఇక పక్కా ఐపీఎల్ 12వ సీజన్ ప్లేఆఫ్ బెర్త్ ను మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఖాయం చేసుకొంది. హోంగ్రౌండ్ వాంఖెడీ స్టేడియం వేదికగా ముగిసిన 13వ రౌండ్ పోటీలో…హైదరాబాద్ సన్ రైజర్స్ ను… ఎలిమినేటర్ ఓవర్ ద్వారా అధిగమించి లీగ్ టేబుల్ లో రెండోస్థానం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా […]

సన్ రైజర్స్ కు ముంబై ఇండియన్స్ షాక్
X
  • హైదరాబాద్-ముంబై జట్ల మ్యాచ్ టై
  • ఎలిమినేటర్ ఓవర్ తో నెగ్గిన ముంబై
  • ప్లే ఆఫ్ రౌండ్లో ముంబై బెర్త్ ఇక పక్కా

ఐపీఎల్ 12వ సీజన్ ప్లేఆఫ్ బెర్త్ ను మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఖాయం చేసుకొంది. హోంగ్రౌండ్ వాంఖెడీ స్టేడియం వేదికగా ముగిసిన 13వ రౌండ్ పోటీలో…హైదరాబాద్ సన్ రైజర్స్ ను… ఎలిమినేటర్ ఓవర్ ద్వారా అధిగమించి లీగ్ టేబుల్ లో రెండోస్థానం సాధించింది.

ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న ఆతిథ్య ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగుల స్కోరు సాధించింది. ఓపెనర్ డీ కాక్ 69 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

సమాధానంగా… 163 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన హైదరాబాద్ సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగుల స్కోరే సాధించడంతో మ్యాచ్ టైగా ముగిసింది. వన్ డౌన్ ఆటగాడు మనీష్ పాండే 8 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 71 పరుగుల స్కోరుతో టాప్ స్కోరర్ గా మిగిలాడు.

రెండుజట్లు ఒకే స్కోరు సాధించడంతో…విజేతను నిర్ణయించడానికి ఎలిమినేటర్ ఓవర్ ఆడించారు. ఇందులో ముంబై విజేతగా నిలిచింది. ముంబై ఓపెనింగ్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఐపీఎల్ ప్రస్తుత సీజన్ మొదటి 13 రౌండ్ల మ్యాచ్ లు ముగిసే సమయానికి…చెన్నై సూపర్ కింగ్స్ 9 విజయాలు, 18 పాయింట్లతో టాపర్ గా నిలిచింది.

ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్… 13 రౌండ్లలో 8 విజయాలతో 16 పాయింట్లు చొప్పున సాధించి…రెండు, మూడుస్థానాలలో ఉన్నాయి.

ప్లే ఆఫ్ రౌండ్లో నాలుగో బెర్త్ కోసం…హైదరాబాద్, జైపూర్, పంజాబ్, కోల్ కతా జట్ల మధ్య నాలుగుస్తంభాలాట జరుగనుంది.

First Published:  3 May 2019 10:26 AM IST
Next Story