ఐపీఎల్ లో బిగ్ హిట్టర్ల సమరం
మొహాలీ వేదికగా బల్లేబల్లే పోరు ఇటు గేల్…అటు రసెల్ పంజాబ్ తో కోల్ కతా డూ ఆర్ డై ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ 13వ రౌండ్లో అతిపెద్ద సమరానికి మొహాలీలోని పంజాబ్ క్రికెట్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీ మాజీ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ , కింగ్స్ పంజాబ్ జట్ల కు డూ ఆర్ డైగా మారింది. మిగిలిన రెండురౌండ్లలో నెగ్గితేనే ఈ రెండుజట్లకూ […]
- మొహాలీ వేదికగా బల్లేబల్లే పోరు
- ఇటు గేల్…అటు రసెల్
- పంజాబ్ తో కోల్ కతా డూ ఆర్ డై
ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ 13వ రౌండ్లో అతిపెద్ద సమరానికి మొహాలీలోని పంజాబ్ క్రికెట్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీ మాజీ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ , కింగ్స్ పంజాబ్ జట్ల కు డూ ఆర్ డైగా మారింది. మిగిలిన రెండురౌండ్లలో నెగ్గితేనే ఈ రెండుజట్లకూ ప్లే ఆఫ్ రౌండ్ చేరే అవకాశాలుంటాయి.
బ్యాటింగ్ కు అత్యంత అనువుగా ఉండే మొహాలీ పిచ్ పైన భారీ షాట్లతో విరుచుకు పడటానికి జమైకన్ సూపర్ హిట్టర్ల జోడీ క్రిస్ గేల్, యాండ్రే రసెల్…చెరో జట్టు తరపున బరిలోకి దిగుతున్నారు.
రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే …పంజాబ్ పై కోల్ కతా నైట్ రైడర్స్ దే పైచేయిగా ఉంది. ప్రస్తుత సీజన్ వరకూ ఈ రెండుజట్లు 24సార్లు తలపడితే….కోల్ కతా 16-8 రికార్డుతో ఉంది.
ఇక..మొహాలీ వేదికగా ఈ రెండుజట్లు ఆడిన మ్యాచ్ ల్లో 3-3 రికార్డుతో సమఉజ్జీలుగా ఉన్నాయి.
ఇప్పటి వరకూ ఆడిన 10 రౌండ్లలో ఇటు కోల్ కతా…అటు పంజాబ్ చెరో ఐదు విజయాలు , 7 పరాజయాలతో 10 పాయింట్ల చొప్పున సాధించాయి. ఆఖరి రెండురౌండ్ల మ్యాచ్ లు రెండుజట్లకూ కీలకం కావడంతో విజయమే లక్ష్యంగా సమరానికి సై అంటున్నాయి.
కోల్ కతా థండర్ హిట్టర్ రసెల్ ప్రస్తుత సీజన్లో ఇప్పటికే 50 కి పైగా సిక్సర్లు బాదటం ద్వారా ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాడు. ఇక…పంజాబ్ ఓపెనర్ క్రిస్ గేల్ కు సైతం ఐపీఎల్ ఓ సీజన్లో..50కి పైగా సిక్సర్లు బాదిన రికార్డు ఉంది.
ఇటు గేల్….అటు రసెల్ సిక్సర్లబాదుడు మొదలు పెడితే…మ్యాచ్ రసపట్టుగా సాగే అవకాశం ఉంది. రసెల్ చెలరేగిపోతే కోల్ కతా నైట్ రైడర్స్…గేల్ రెచ్చిపోతే కింగ్స్ పంజాబ్ విజేతగా నిలిచే అవకాశం ఉంది. ఎవరు బాదినా …క్రికెట్ అభిమానులకు ఈమ్యాచ్ పసందైన విందే కానుంది.