Telugu Global
Cinema & Entertainment

నాని గట్టెక్కాడు

పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత జెర్సీ సినిమాకు అతికినట్టు సరిపోతుంది. రిలీజైన వెంటనే సినిమా బ్లాక్ బస్టర్ అన్నారంతా. కట్ చేస్తే రివ్యూల్లో కనిపించినంత హైప్ వసూళ్లలో కనిపించలేదు. అలా నెమ్మదిగా సాగుతున్న జెర్సీ ఎట్టకేలకు గట్టెక్కింది. నిన్నటితో 2 వారాల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా బ్రేక్-ఈవెన్ సాధించింది. సినిమా టాక్ చూసి మొదటి వారంలోనే బ్రేక్-ఈవెన్ అవుతుందని అంతా ఊహించారు. రెండో వారం నుంచి లాభాలు లెక్కేసుకోవచ్చని భావించారు. కానీ కాంచన-3 […]

నాని గట్టెక్కాడు
X

పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత జెర్సీ సినిమాకు అతికినట్టు సరిపోతుంది. రిలీజైన వెంటనే సినిమా బ్లాక్ బస్టర్ అన్నారంతా. కట్ చేస్తే రివ్యూల్లో కనిపించినంత హైప్ వసూళ్లలో కనిపించలేదు. అలా నెమ్మదిగా సాగుతున్న జెర్సీ ఎట్టకేలకు గట్టెక్కింది. నిన్నటితో 2 వారాల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా బ్రేక్-ఈవెన్ సాధించింది.

సినిమా టాక్ చూసి మొదటి వారంలోనే బ్రేక్-ఈవెన్ అవుతుందని అంతా ఊహించారు. రెండో వారం నుంచి లాభాలు లెక్కేసుకోవచ్చని భావించారు.

కానీ కాంచన-3 సినిమా బాగా దెబ్బేసింది. దీంతో బ్రేక్-ఈవెన్ అవ్వడానికి 2 వారాల సమయం పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల రూపాయలకు ఈ సినిమాను అమ్మితే, ఆ వసూళ్లు సాధించడానికి జెర్సీకి 2 వారాల టైమ్ పట్టింది.

ఈ 14 రోజుల్లో జెర్సీ సినిమాకు 20 కోట్ల 54 లక్షల రూపాయల షేర్ వచ్చింది. నైజాం, ఉత్తరాంధ్ర నుంచి మూవీకి ఎక్కువ షేర్లు వచ్చాయి. అటు ఓవర్సీస్ లో 5 కోట్ల నెట్ తో స్ట్రాంగ్ గా రన్ అవుతోంది జెర్సీ. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 9.61 కోట్లు
సీడెడ్ – రూ. 1.98 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.38 కోట్లు
ఈస్ట్ – రూ. 1.66 కోట్లు
వెస్ట్ – రూ. 1.17 కోట్లు
గుంటూరు – రూ. 1.54 కోట్లు
కృష్ణా – రూ. 1.51 కోట్లు
నెల్లూరు – రూ. 0.69 కోట్లు

First Published:  3 May 2019 8:35 AM IST
Next Story