జేసీపై చర్యలకు ఎన్నికల సంఘం ఆదేశం
తమ మాటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఎప్పటిలాగే తన నోటి దురుసుతో ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డబ్బు పంపిణీకి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై వెంటనే చర్య తీసుకోవాలని ఈసీ అనంతపురం కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ ఎన్నికల్లో తన కొడుకు గెలవడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను వైసీపీ, సీపీఐ పార్టీలు ఈసీకి ఫిర్యాదు […]
తమ మాటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఎప్పటిలాగే తన నోటి దురుసుతో ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డబ్బు పంపిణీకి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై వెంటనే చర్య తీసుకోవాలని ఈసీ అనంతపురం కలెక్టర్‌ను ఆదేశించింది.
ఈ ఎన్నికల్లో తన కొడుకు గెలవడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను వైసీపీ, సీపీఐ పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని రిటర్నింగ్ అధికారి నిర్ణయించారు. దీంతో అతనిపై చర్యలకు కలెక్టర్ వీరపాండియన్ రంగం సిద్దం చేశారు.
ఎన్నికల్లో డబ్బును వెదజల్లి ఓట్లు వేయించుకున్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యలను ఈసీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నివేదిక కలెక్టర్‌కు చేరడంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.