బాడీగార్డ్‌ను పెళ్ళిచేసుకున్న రాజు
థాయిలాండ్ రాజు నిన్న (బుధవారం) తన వ్యక్తిగత భద్రతాదళ డిప్యూటీ చీఫ్ సుథిదను వివాహం చేసుకున్నాడు. ఆయనకు గతంలో మూడుసార్లు పెళ్ళిళ్లు జరిగాయి. ఏడుగురు సంతానం కూడా ఉన్నారు. అయితే ఆ ముగ్గురుకు విడాకులు ఇచ్చిన థాయిలాండ్ రాజు ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నారు. వారసత్వంగా థాయిలాండ్‌కు 10వ రామా రాజుగా అధికారం చేపట్టిన ఈయన వయసు 66 ఏళ్ళు. ఈనెల 4వ తారీఖున ఆయనకు పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ఐదవ తేదీన ఆ దేశ రాజుగా బ్యాంకాక్ […]
థాయిలాండ్ రాజు నిన్న (బుధవారం) తన వ్యక్తిగత భద్రతాదళ డిప్యూటీ చీఫ్ సుథిదను వివాహం చేసుకున్నాడు. ఆయనకు గతంలో మూడుసార్లు పెళ్ళిళ్లు జరిగాయి. ఏడుగురు సంతానం కూడా ఉన్నారు. అయితే ఆ ముగ్గురుకు విడాకులు ఇచ్చిన థాయిలాండ్ రాజు ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నారు.
వారసత్వంగా థాయిలాండ్‌కు 10వ రామా రాజుగా అధికారం చేపట్టిన ఈయన వయసు 66 ఏళ్ళు. ఈనెల 4వ తారీఖున ఆయనకు పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ఐదవ తేదీన ఆ దేశ రాజుగా బ్యాంకాక్ వీధుల్లో ఊరేగింపు జరగనుంది.
ఈ నేపథ్యంలో ఆయన సుథిదను వివాహం చేసుకున్నాడు. ఆమెకు రాణిగా అధికారిక గుర్తింపునిచ్చాడు.
ఈ సుథిద ఒకప్పుడు థాయ్ ఎయిర్‌వేస్‌లో ఫ్లైట్ అటండెంట్. ఈయన దృష్టిలో పడ్డ సుథిదను 2014లో తన బాడీగార్డ్ గా నియమించుకున్నాడు. ఆతరువాత ఆమె డిప్యూటీ చీఫ్ అయింది. వీళ్ళిద్దరి మధ్య ప్రేమవ్యవహారం నడుస్తున్నట్లు రాజభవనంలోనూ, ప్రజల్లోనూ గుసగుసలు వినిపించేవి. ఈ వివాహంతో ఆ గుసగుసలకు పులిస్టాప్ పడినట్లయింది.