పసుపు కుంకుమే ఆశలపై నీళ్లు చల్లిందా... తెలుగు తమ్ముళ్ల అంతర్మథనం !
ఏపీలో గెలుపుపై టీడీపీ శిబిరంలో రోజురోజుకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఏపీలో ఎన్నికలు జరిగి 20 రోజులైంది. ఇంకా 22రోజుల్లో ఫలితాలు వస్తాయి. అయితే ఇప్పటికే బూత్‌ల వారీగా వివరాలు సేకరించిన తెలుగు తమ్ముళ్లకు గెలుపుపై నమ్మకం లేకుండా పోయింది. ప్రధాన ప్రతిపక్షంగా సీట్లు వస్తే చాలు అనే లెక్కలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సారి టీడీపీ అధినేత నుంచి గ్రామంలోని కార్యకర్త వరకు పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాల మీద ఆశలు పెట్టుకున్నారు. దీంతో పాటు […]
ఏపీలో గెలుపుపై టీడీపీ శిబిరంలో రోజురోజుకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఏపీలో ఎన్నికలు జరిగి 20 రోజులైంది. ఇంకా 22రోజుల్లో ఫలితాలు వస్తాయి. అయితే ఇప్పటికే బూత్‌ల వారీగా వివరాలు సేకరించిన తెలుగు తమ్ముళ్లకు గెలుపుపై నమ్మకం లేకుండా పోయింది. ప్రధాన ప్రతిపక్షంగా సీట్లు వస్తే చాలు అనే లెక్కలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఈ సారి టీడీపీ అధినేత నుంచి గ్రామంలోని కార్యకర్త వరకు పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాల మీద ఆశలు పెట్టుకున్నారు. దీంతో పాటు రైతు రుణమాఫీ నాలుగు, ఐదు విడతల డబ్బులతో ప్రజలు తమ వైపు తిరుగుతారని భావించారు. 2014 ఎన్నికల మాదిరిగానే చివరి వారం రోజుల్లో తమ వైపు ప్రజలు వస్తారని ఆశించారు.
కానీ గ్రౌండ్ లెవల్లో మాత్రం ఈ సారి దెబ్బపడింది. పసుపు కుంకుమ డబ్బులు సగం డ్వాక్రా సంఘాలకు కూడా అందలేదు. చెక్కులు అందిన సంఘాలకు బ్యాంకులు డబ్బులు ఇవ్వలేదు. దీంతో మహిళల్లో అనుకున్నంత సానుకూలత ప్రభుత్వానికి రాలేదు. మొత్తానికి ఈ విషయంలో దెబ్బపడింది.
ఇప్పుడు ప్రతి జిల్లా పేపర్‌లో టీడీపీ అనుకూల పత్రికలు ఇదే విషయాన్ని రాస్తున్నాయి. రోజుకో జిల్లాలో ఇదే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నాయి. పసుపు కుంకుమ చెక్కుల క్లియరెన్స్ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని కథనాలు అల్లుతున్నాయి. మొత్తానికి పసుపు కుంకుమపై ఆశలు పెట్టుకున్న తెలుగు తమ్ముళ్లు గ్రౌండ్ లెవల్లో తీయాల్సినంత డబ్బులు బయటకు తీయలేదట. దీంతో పాటు చివరి రెండు రోజుల్లో ఈసీ ఆఫీసుల ముందు ధర్నాలు, ఈవీఎంలపై నిందలతో మరికొందరికి ఓడిపోతున్నామనే సీన్ అర్ధమైంది. దీంతో వారు డబ్బులు తీయలేదు. ఈ ఎఫెక్ట్ తెలుగుదేశం గెలుపుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం మాత్రం కన్పిస్తోంది.
రైతు రుణమాఫీ నాలుగు, ఐదు విడతల డబ్బులు కూడా రైతులకు అందలేదు. కొందరి బ్యాంకు అకౌంట్లలో ఇప్పటివరకూ డబ్బు పడలేదు. ఇంకొందరి అకౌంట్లలో పడితే పాత బాకీలకు జమ చేశారు. రెండు బ్యాంకు అకౌంట్లు ఉంటే…ఏ అకౌంట్లలో అప్పు ఉంటే… ఆ అకౌంట్ బాకీ సెటిల్ చేశారు. దీంతో రైతులకు రుణమాఫీ డబ్బులతో ఒరిగిందేమీ లేదు. అన్నదాత సుఖీభవ చెక్కులపై కూడా రైతుల్లో పాజిటివ్ నెస్ కన్పించలేదు.
మొత్తానికి ఇప్పుడు టీడీపీకి పెన్షనర్లు దిక్కు అయ్యారు. వారు పూర్తిగా అటువైపే మొగ్గు చూపే పరిస్థితిలేదు. దీంతో ఎక్కడికక్కడ నేతలు గప్‌చుప్ అయ్యారు. ఫలితాలు తమకు అనుకూలంగా లేవని…సైలెంట్ అయిపోయారు. ఐదేళ్ళు పనిచేయకుండా చివరి నెలలో డ్రామాలు చేస్తే…. ఓట్లు వేసే అంత అమాయకంగా ఇప్పుడు గ్రామీణులు లేరు అని కొందరు టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.