Telugu Global
National

ఇంతకీ ఎక్స్ పైరీ తేదీ ఎవరికి?

దేశ రాజకీయాలు, లోక్ సభ ఎన్నికల ప్రచారాలు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఈసారి ఢిల్లీ గద్దెను అలంకరించకపోతే, భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ భావిస్తుంటే, అధికారాన్ని తిరిగి నిలబెట్టుకుని తీరాలని బీజేపీ కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఇరు పార్టీల అధినేతలు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు వచ్చే మే 23వ తేదీ విపక్షాలకు ఎక్స్ పైరీ డేట్ అని ప్రకటించారు. ఉత్తర […]

ఇంతకీ ఎక్స్ పైరీ తేదీ ఎవరికి?
X

దేశ రాజకీయాలు, లోక్ సభ ఎన్నికల ప్రచారాలు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఈసారి ఢిల్లీ గద్దెను అలంకరించకపోతే, భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ భావిస్తుంటే, అధికారాన్ని తిరిగి నిలబెట్టుకుని తీరాలని బీజేపీ కృషి చేస్తోంది.

ఈ క్రమంలో ఇరు పార్టీల అధినేతలు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు వచ్చే మే 23వ తేదీ విపక్షాలకు ఎక్స్ పైరీ డేట్ అని ప్రకటించారు.

ఉత్తర ప్రదేశ్ లో విపక్షాలు దిమ్మ తిరిగేలా తాము ఫలితాలు సాధిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల పోలింగ్ లో ప్రజలు తమకే మద్దతు ప్రకటించారని అన్నారు.

మరోవైపు ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాలుగు దశల పోలింగ్ సరళిని చూశాక నరేంద్ర మోడీ ముఖం మాడిపోయిందని, వారు ఓటమి దిశగా పయనిస్తున్నారని ఆయనకు అర్థమైందని వ్యాఖ్యానించారు.

అయితే, ఈ ఇద్దరు నేతల తీరు మీద రాజకీయ పరిశీలకులు ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాము విశ్వసించిన అంశాలు, తమ తమ ఎజెండాలో ప్రస్తావించిన అంశాలను పక్కకు నెట్టి వేరే ఏదేదో మాట్లాడుతున్నారని అంటున్నారు.

తాము అధికారంలోకి వస్తే న్యాయ్ పథకం ద్వారా పేదలకు న్యాయం చేస్తామని, దారిద్ర్య రేఖకు దిగువగా ఉండే ప్రతి కుటుంబానికి నెలకు ఆరు వేల రూపాయల ఆర్థిక భరోసా కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీని మీద ప్రజల నుంచి కొంత సానుకూలత వ్యక్తం అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు ఎక్కువగా దీనిని ప్రచారంలో పెట్టలేకపోతున్నారని పరిశీలకుల అభిప్రాయం.

అటు బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉందని అంటున్నారు. తాము ప్రధానంగా ఎజెండాలో పెట్టిన అయోధ్య రామాలయ నిర్మాణ అంశాన్ని మాత్రం ప్రచారంలో ప్రస్తావించడం లేదని అంటున్నారు.

మరోవైపు మిత్రపక్షం శివసేన అనూహ్యంగా బీజేపీని ఇరుకున పడవేసింది. శ్రీలంకలో మాదిరిగా ఇండియాలో కూడా బురఖా మీద నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. ట్రిపుల్ తలాక్ చట్టం మీద ఎన్నికల ప్రచార సభలలో అంతగా మాట్లాడని బీజేపీ దీని మీదా మౌనం వహించింది. అధినేతలు కూడా ఈ రెండు అంశాల మీద నోరు మెదపడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు మే 23న ఎక్స్ పైరీ తేదీ ఎవరికి ప్రకటిస్తారో వేచి చూడాల్సిందేనని పరిశీలకులు అంటున్నారు.

First Published:  1 May 2019 11:10 PM GMT
Next Story