మహర్షికి నెగెటివ్ టాక్ వచ్చినా.... పెద్దప్లానే వేసిన దిల్ రాజ్?
హైదరాబాద్ లో నిన్న సాయంత్రమే మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా జరిపారు నిర్మాతలు. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో దిల్ రాజు, పీవీపీ, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం మహర్షి. మహేష్ బాబు కెరీర్ లో ఇది 25 వ చిత్రం కావడం తో అంతా ఎంతో ఉత్సాహం గా ఉన్నారు. అయితే మీడియా లో వస్తున్న వివిధ కథనాల ప్రకారం ముగ్గురు నిర్మాతలు సినిమా బిజినెస్ జరిగిన తీరు పై అసంతృప్తి […]
హైదరాబాద్ లో నిన్న సాయంత్రమే మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా జరిపారు నిర్మాతలు. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో దిల్ రాజు, పీవీపీ, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం మహర్షి.
మహేష్ బాబు కెరీర్ లో ఇది 25 వ చిత్రం కావడం తో అంతా ఎంతో ఉత్సాహం గా ఉన్నారు. అయితే మీడియా లో వస్తున్న వివిధ కథనాల ప్రకారం ముగ్గురు నిర్మాతలు సినిమా బిజినెస్ జరిగిన తీరు పై అసంతృప్తి ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఒకరేమో తమ కి కావాల్సిన పంపిణీదారులకి సినిమా ఇవ్వలేదు అని అంటే, మరొకరు సినిమా ని నష్టాల తో విడుదల చేస్తున్నాం అని, మరొకరు అనుకున్న ధర కంటే తక్కువ కి అమ్మాము అని అంటున్నారట.
అయితే దిల్ రాజు రిలీజ్ ప్లానింగ్ లో ఎప్పుడూ మంచి స్ట్రాటజీ తో దిగుతాడు. తాజా వార్తల ప్రకారం ఈ సినిమా విడుదల అయ్యే మొదటి వారం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ని ముఖ్య టౌన్స్, సిటీస్ లో ఈ సినిమా టికెట్ ధర ని 200 చేసే దిశగా దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడట. ఒక వేళ సినిమా టాక్ అనుకూలంగా లేకపోయినా పెరిగిన ధరల వలన తనకు లాభం చేకూరుతుంది అనేది తన ఆలోచన. ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.