Telugu Global
NEWS

అవును.... టీడీపీ చెప్పింది నిజం " వైసీపీ నాయకుడు కాకాణి

అవును…. టీడీపీ చెప్పింది నిజమేనని ఒప్పుకున్నాడు వైసీపీ నాయకుడు కాకాణి. మొదటి బడ్జెట్‌ ప్రసంగంలో ఈ ప్రభుత్వ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు…. తాము ప్రతి సంక్షోభాన్ని మాకు అవకాశంగా మార్చుకుంటామని చెప్పాడని…. అంటే ఏమిటో అప్పుడు అర్థం కాలేదని…. సంక్షోభాన్ని అవకాశంగా ఎలా మార్చుకుంటారో? తెలియలేదని…. కానీ ఈ నాలుగున్నరేళ్ళ పాలనలో అర్థమైందని…. మరీ ముఖ్యంగా ఈ నెల రోజుల్లో ఇంకా బాగా అర్థమైందని కాకాణి అన్నారు. ఎలాగంటే…. ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉండి కూడా తుఫాన్‌ను […]

అవును.... టీడీపీ చెప్పింది నిజం  వైసీపీ నాయకుడు కాకాణి
X

అవును…. టీడీపీ చెప్పింది నిజమేనని ఒప్పుకున్నాడు వైసీపీ నాయకుడు కాకాణి. మొదటి బడ్జెట్‌ ప్రసంగంలో ఈ ప్రభుత్వ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు…. తాము ప్రతి సంక్షోభాన్ని మాకు అవకాశంగా మార్చుకుంటామని చెప్పాడని…. అంటే ఏమిటో అప్పుడు అర్థం కాలేదని…. సంక్షోభాన్ని అవకాశంగా ఎలా మార్చుకుంటారో? తెలియలేదని…. కానీ ఈ నాలుగున్నరేళ్ళ పాలనలో అర్థమైందని…. మరీ ముఖ్యంగా ఈ నెల రోజుల్లో ఇంకా బాగా అర్థమైందని కాకాణి అన్నారు.

ఎలాగంటే…. ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉండి కూడా తుఫాన్‌ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ నిధులు కొట్టేయడానికి వీళ్ళు వేస్తున్న ఎత్తుగడలు చూస్తే…. నిజమే వీళ్ళు సంక్షోభాన్ని కూడా అవకాశంగా మార్చుకోగలరని రుజువవుతోందని అన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు కరువు మండలాల గురించి సమీక్షలు చేయకుండా…. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు సమీక్షలు అంటూ నాటకాలు ఆడుతూ…. ఆ సమీక్షలను ఎవరో అడ్డుకుంటున్నట్లు డ్రామాలాడుతున్నారన్నారు. అసలు చంద్రబాబు చేస్తున్న సమీక్షలు దేనికోసమో, సీఎం నుంచి మంత్రుల వరకు సమీక్షలతో ఎందుకు నానాయాగి చేస్తున్నారో చెప్పాలన్నారు కాకాణి.

మీ అవినీతి ఆధారాలను తుడిచి పెట్టేందుకు ఈ సమీక్షలు చేద్దామనుకుంటే…. సీఎస్‌ అడ్డుకున్నారని దాంతో ఆయనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇక అధికారంలోకి రామన్న ఆలోచనతో ఈ సమీక్షలను అడ్డం పెట్టుకొని తుపాను నిధులను దొరికినకాడికి మింగేయాలని చూస్తున్నారన్నారు.

అయితే సమీక్షలు చేయాల్సింది ఈ ఐదేళ్ళలో జరిగిన అక్రమాలమీద, ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాలమీద, స్కామ్‌లమీదనని సూచించారు కాకాణి.

వ్యవసాయం గురించి తెలియని వ్యక్తి వ్యవసాయ మంత్రి అయ్యాడని ఎద్దేవా చేశారు. సోమిరెడ్డికి వ్యవసాయం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని…. రైతుల రుణభారాన్ని రెట్టింపు చేశారన్నారు. రైతు రుణాలు ఎందుకు మాఫీ చేయలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేకపోయారన్నారు. ఏపీ చరిత్రలో అత్యంత అసమర్థ మంత్రిగా సోమిరెడ్డి నిలిచారన్నారు.

స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్స్‌లను ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వామినాధన్‌ కమిషన్‌ అన్నారని…. అధికారంలోకి వచ్చాక చంద్రమోహన్ కమిషన్‌ అంటున్నారని ఎద్దేవా చేశారు కాకాణి.

దేశంలో అతితక్కువ ఆదాయం పొందుతున్నది ఆంధ్రపదేశ్ రైతులేనని, రైతులకు అత్యల్ప ఆదాయం వచ్చే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ దేశంలో నెంబర్‌ 1 గా ఉందని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయన్నారు.

చంద్రబాబు ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడానికే సోమిరెడ్డికి పదవి ఇచ్చాడని ఎద్దేవా చేశారు కాకాణి. నాలుగు, ఐదు విడతల రుణమాఫీ నిధులు ఎందుకు విడుదల చేయలేదో సోమిరెడ్డి చెప్పాలన్నారు.

చంద్రబాబుకు చివరి అవకాశం కాబట్టే…. ఇంకా చిల్లరమల్లర వసూళ్ళు చేసుకోవడానికి ఇలా సమీక్షల పేరుతో సచివాలయానికి వెళ్తున్నారన్నారు కాకాణి.

అవినీతి, అక్రమాలలో చంద్రబాబు సర్కార్‌ కూరుకుపోయిందని…. అవినీతిలో, అప్పుల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్‌ 1 గా నిలిపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు కాకాణి.

First Published:  2 May 2019 4:01 AM GMT
Next Story