సెంటిమెంట్ వీడని మహర్షి
సినిమా ప్రారంభోత్సవం నుంచి ఒకటే సెంటిమెంట్ ఫాలో అవుతోంది మహర్షి టీమ్. అది వంశీ పైడిపల్లి సెంటిమెంటా.. దిల్ రాజు సెంటిమెంటా లేక మహేష్ సెంటిమెంటో తెలీదు కానీ.. 9 అనే అంకెను యూనిట్ సెంటిమెంట్ గా ఫీల్ అవుతోంది. ప్రతి ప్రచార కార్యక్రమానికి 9 అనే అంకెను ప్రామాణికంగా తీసుకుంటోంది. టీజర్ ను ఉదయం 9 గంటల 9 నిమిషాలకు, ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ […]
సినిమా ప్రారంభోత్సవం నుంచి ఒకటే సెంటిమెంట్ ఫాలో అవుతోంది మహర్షి టీమ్. అది వంశీ పైడిపల్లి సెంటిమెంటా.. దిల్ రాజు సెంటిమెంటా లేక మహేష్ సెంటిమెంటో తెలీదు కానీ.. 9 అనే అంకెను యూనిట్ సెంటిమెంట్ గా ఫీల్ అవుతోంది. ప్రతి ప్రచార కార్యక్రమానికి 9 అనే అంకెను ప్రామాణికంగా తీసుకుంటోంది.
టీజర్ ను ఉదయం 9 గంటల 9 నిమిషాలకు, ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేశారు. అంతెందుకు.. పాటల విడుదల కార్యక్రమానికి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అయ్యారు. ఇప్పుడు ట్రయిలర్ రిలీజ్ కు కూడా అదే సెంటిమెంట్ పట్టుకుంది.
ఈరోజు రాత్రి సరిగ్గా 8 గంటల 10 నిమిషాలకు మహర్షి ట్రయిలర్ ను లాంచ్ చేయబోతున్నారు. అంటే ఇక్కడ కూడా 9 సెంటిమెంట్ ఫాలో అయ్యారన్నమాట. సాయంత్రం 7 గంటల నుంచి మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్, హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో జరుగుతుంది. ఈ వేదికపై సరిగ్గా 8 గంటల 10 నిమిషాలకు ట్రయిలర్ ను లాంఛ్ చేయబోతున్నారు. అదే సమయానికి సోషల్ మీడియాలో కూడా ట్రయిలర్ ప్రత్యక్షం కాబోతోంది.