Telugu Global
International

ఇరాన్ మహిళా క్రీడాకారిణులకు ఇదేమి కష్టం

ఇరాన్ మహిళా బాక్సర్ కు డ్రెస్ కోడ్ కష్టాలు విదేశీ గడ్డపై విజయం సాధించినా స్వదేశంలో చీత్కారాలు ఫ్రాన్స్ లో తలదాచుకొన్న సదాఫ్ ఖాదెమ్ అంతర్జాతీయస్థాయిలో ఓ మహిళ విజయం సాధిస్తే…ఏ దేశమైనా…ఏ ప్రభుత్వమైనా ఏంచేస్తుంది?…విదేశీ గడ్డపై విజయం సాధించి తమ దేశానికే గర్వకారణంగా నిలవడంతో పాటు…అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినందుకు భుజం తట్టి ప్రోత్సహిస్తుంది. అయితే… ఇస్లామిక్ దేశం ఇరాన్ లో మాత్రం పరిస్థితి దానికి వ్యతిరేకంగా కనిపిస్తోంది. ఇరాన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం… క్రీడల్లో పాల్గొనే […]

ఇరాన్ మహిళా క్రీడాకారిణులకు ఇదేమి కష్టం
X
  • ఇరాన్ మహిళా బాక్సర్ కు డ్రెస్ కోడ్ కష్టాలు
  • విదేశీ గడ్డపై విజయం సాధించినా స్వదేశంలో చీత్కారాలు
  • ఫ్రాన్స్ లో తలదాచుకొన్న సదాఫ్ ఖాదెమ్

అంతర్జాతీయస్థాయిలో ఓ మహిళ విజయం సాధిస్తే…ఏ దేశమైనా…ఏ ప్రభుత్వమైనా ఏంచేస్తుంది?…విదేశీ గడ్డపై విజయం సాధించి తమ దేశానికే గర్వకారణంగా నిలవడంతో పాటు…అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినందుకు భుజం తట్టి ప్రోత్సహిస్తుంది.

అయితే… ఇస్లామిక్ దేశం ఇరాన్ లో మాత్రం పరిస్థితి దానికి వ్యతిరేకంగా కనిపిస్తోంది. ఇరాన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం… క్రీడల్లో పాల్గొనే మహిళలు తమ శరీరభాగాలు కనిపించకుండా… ముసుగులు ధరించి ఆడటం తప్పనిసరి.

వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్ బాల్, కుస్తీ….. చివరకు టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ పోటీలలో సైతం ఇరానీ మహిళలు.. తమ శరీరభాగాలు కనిపించకుండా ఉండే దుస్తులు ధరించే పాల్గొంటూ వస్తున్నారు.

అయితే..ఫ్రాన్స్ వేదికగా ఇటీవలే ముగిసిన ఓ అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ టోర్నీలో పాల్గొన్న ఇరానీ బాక్సర్ సదాఫ్ ఖాదెమ్ మాత్రం…అంతర్జాతీయస్థాయిలో మహిళా బాక్సర్లు ధరించే దుస్తులు మాత్రమే ధరించి మరీ.. బరిలోకి దిగింది. ఫ్రెంచ్ బాక్సర్ అన్నా చావిన్ తో జరిగిన ఫైట్ లో పాల్గొని విజేతగా నిలిచింది.

అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ లో విజయం సాధించిన తొలి ఇరానీ మహిళగా చరిత్ర సృష్టించింది. 24 ఏళ్ల సదాఫ్ కు విజయం సాధించిన ఆనందం నిలకుండా పోయింది. తల, చాతీ భాగాలు కనిపించేలా మహిళలు దుస్తులు ధరించడం ఇస్లాం చట్టప్రకారం తీవ్రమైన నేరం.

అంతేకాదు… ఇరానీ మహిళల దుస్తుల నిబంధనలకు సైతం విరుద్ధం కావడంతో…స్వదేశం నుంచి తిట్లు, శాపనార్థాలతో పాటు… బెదిరింపులు సైతం రావడంతో…సదాఫ్…ఫ్రాన్స్ లోనే తలదాచుకోవాలని నిర్ణయించింది.

మరోవైపు…ఈ వివాదం ఇరాన్ బాక్సింగ్ సమాఖ్య కానీ…ఇరానీ న్యాయశాఖ కానీ వ్యాఖ్యానించడానికి నిరాకరించడం విశేషం. ఇదంతా చూస్తుంటే..పాపం! ఇరాన్ మహిళలు అనుకోక తప్పదు.

First Published:  1 May 2019 9:40 AM IST
Next Story