ఫ్లాప్ దర్శకుడితో ఆకాష్ పూరి
దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి ఈ మధ్యనే ‘మెహబూబా’ అనే సినిమాతో హీరోగా మారాడు. పూరి జగన్నాథ్ స్వయంగా ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకాష్ పూరి రెండవ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తాడు అనుకుంటే పూరి మాత్రం ఆ బాధ్యతను తన అసోసియేట్ అయిన అనిల్ […]
దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి ఈ మధ్యనే ‘మెహబూబా’ అనే సినిమాతో హీరోగా మారాడు. పూరి జగన్నాథ్ స్వయంగా ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆకాష్ పూరి రెండవ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తాడు అనుకుంటే పూరి మాత్రం ఆ బాధ్యతను తన అసోసియేట్ అయిన అనిల్ పాడూరి చేతిలో పెట్టాడు. ప్రస్తుతం అనిల్ దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా ‘రొమాంటిక్’ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమా ఇంకా పూర్తి అవలేదు. కానీ అప్పుడే ఆకాష్ తన మూడవ సినిమా లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఆకాష్ పూరి తన మూడవ సినిమాని ఏ. మల్లికార్జున్ దర్శకత్వంలో చేయబోతున్నాడట. ఇంతకు ముందు ఏ. మల్లికార్జున్ కళ్యాణ్ రామ్ హీరోగా ‘అభిమన్యు’, ‘కళ్యాణ్ రామ్ కత్తి’, ‘షేర్’ సినిమాలను తెరకెక్కించాడు…. కానీ అవన్నీ డిజాస్టర్లుగా మారాయి.
మరి అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ ఆ దర్శకుడి చేతిలోకి ఆకాష్ పూరి సినిమా ఎలా వెళ్ళింది అని అందరూ షాక్ కి గురి అవుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఏ. మల్లికార్జున్ ఈసారి అద్భుతమైన కథతో వచ్చాడని అందుకే పూరి కూడా ఒప్పుకున్నట్లు గా తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.