ఓటుకు నోటు-పాలమూరులో కలకలం !
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు కలకలం రేపుతోంది. ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్థులను లొంగదీసుకునేందుకు అధికార పార్టీ అభ్యర్థులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం పాలమూరులో హాట్ టాపిక్ అయింది. నాగర్ కర్నూలు జిల్లా గగ్గలపల్లి కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి దొడ్ల వెంకటరెడ్డి ఇటీవల నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అయితే తనను టీఆర్ఎస్ అభ్యర్థి ఈశ్వర్‌రెడ్డి బెదిరించారని నాగర్ కర్నూలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తనకు పదిలక్షల రూపాయలు కూడా ఇచ్చారని డబ్బును ప్రదర్శించారు. […]
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు కలకలం రేపుతోంది. ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్థులను లొంగదీసుకునేందుకు అధికార పార్టీ అభ్యర్థులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం పాలమూరులో హాట్ టాపిక్ అయింది.
నాగర్ కర్నూలు జిల్లా గగ్గలపల్లి కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి దొడ్ల వెంకటరెడ్డి ఇటీవల నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అయితే తనను టీఆర్ఎస్ అభ్యర్థి ఈశ్వర్‌రెడ్డి బెదిరించారని నాగర్ కర్నూలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తనకు పదిలక్షల రూపాయలు కూడా ఇచ్చారని డబ్బును ప్రదర్శించారు.
ఆదివారం నామినేషన్ ఉపసంహరించుకున్న గగ్గలపల్లి కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి దొడ్ల వెంకట్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. పోటీ నుంచి తప్పుకోవాలంటూ తనను ప్రత్యర్థి బెదిరించారని ఫిర్యాదుచేశారు. తెరాస అభ్యర్థి ఈశ్వర్ రెడ్డి తనను చంపుతానని బెదిరించినందుకే పోటీ నుంచి తప్పుకున్నట్టు ఆయన వివరించారు.
పోటీ నుంచి తప్పుకోవాలని తనకు రూ.10లక్షలు కూడా ఇచ్చారని తెలిపిన వెంకట్ రెడ్డి.. ఆ డబ్బును కలెక్టరేట్‌కు తీసుకొచ్చి డీఆర్వోకి చూపించారు. అయితే, దొడ్ల వెంకట్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో గగ్గలపల్లి ఎంపీటీసీగా తెరాస అభ్యర్థి దొడ్ల ఈశ్వర్ రెడ్డి నిన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.