పార్టీ మారడంపై జగ్గారెడ్డి క్లారిటీ..!
కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గతంలో టీఆర్ఎస్ పార్టీని ఎంతగానో విభేదించారు. కానీ ఈ సారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేసీఆర్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇదంతా తన రాజకీయ మనుగడ కోసమే అని అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. తనను ఎవరూ ఏ పార్టీలోనికి రావాలని పిలవలేదని.. కేవలం ప్రజల కోసమే నేను ఈ పని చేస్తున్నానని అన్నారు. తన కుటుంబ సభ్యుల కోసం మాత్రమే పార్టీ మారనని ఆయన […]

కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గతంలో టీఆర్ఎస్ పార్టీని ఎంతగానో విభేదించారు. కానీ ఈ సారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేసీఆర్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇదంతా తన రాజకీయ మనుగడ కోసమే అని అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు.
తనను ఎవరూ ఏ పార్టీలోనికి రావాలని పిలవలేదని.. కేవలం ప్రజల కోసమే నేను ఈ పని చేస్తున్నానని అన్నారు. తన కుటుంబ సభ్యుల కోసం మాత్రమే పార్టీ మారనని ఆయన స్పష్టం చేశారు.
గతంతో వైఎస్ఆర్ పిలిచినందునే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారానని ఆయన చెప్పారు. ఈ సారి మాత్రం ఎవరూ పిలవకుండానే తనంతట తానుగానే వెళ్లానని ఆయన అన్నారు.