నేటి నుంచి అక్కడ ముఖం కప్పుకోవడం నిషేధం
ముసుగులు, బుర్కాలు ధరించి గత ఈస్టర్ నాడు తీవ్రవాదులు శ్రీలంకలో బాంబు దాడులకు తెగబడ్డ సంగతి తెలిసిందే. దాదాపు 350 మంది మరణించిన ఈ ఘటన తర్వాత శ్రీలంక ప్రభుత్వం నష్టనివారణ, భద్రతా చర్యలకు ఉపక్రమించింది. ఈ రోజు నుంచి శ్రీలంకలో తమ ఐడెంటిటీని దాచిపెట్టేలా ముఖానికి స్కార్ఫ్, బుర్కాలు ధరించడాన్ని నిషేధించింది. శ్రీలంక అధ్యక్ష కార్యాలయం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఇది ఏ వర్గం, మతం మనోభావాలను కించపరచడానికి కాదనీ, కేవలం ప్రజల రక్షణ […]
ముసుగులు, బుర్కాలు ధరించి గత ఈస్టర్ నాడు తీవ్రవాదులు శ్రీలంకలో బాంబు దాడులకు తెగబడ్డ సంగతి తెలిసిందే. దాదాపు 350 మంది మరణించిన ఈ ఘటన తర్వాత శ్రీలంక ప్రభుత్వం నష్టనివారణ, భద్రతా చర్యలకు ఉపక్రమించింది.
ఈ రోజు నుంచి శ్రీలంకలో తమ ఐడెంటిటీని దాచిపెట్టేలా ముఖానికి స్కార్ఫ్, బుర్కాలు ధరించడాన్ని నిషేధించింది. శ్రీలంక అధ్యక్ష కార్యాలయం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఇది ఏ వర్గం, మతం మనోభావాలను కించపరచడానికి కాదనీ, కేవలం ప్రజల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అధ్యక్ష కార్యాలయం స్పష్టం చేసింది.
మరోవైపు, బాంబు దాడుల తర్వాతి ఆదివారం (28.04.2019)నాడు చర్చీలన్నీ బోసి పోయాయి. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేసినప్పటికీ ప్రార్థనల కోసం చర్చీల వైపు రావడానికే ప్రజలు భయపడ్డారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
ఇక తీవ్రవాదుల కోసం శ్రీలంక ఆర్మీ దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. ఎక్కడ అనుమానితులు కనపడినా వారిని అదుపులోనికి తీసుకొని ప్రశ్నిస్తోంది. పర్యాటక రంగం కూడా ప్రస్తుతం స్తబ్ధుగా ఉంది. మరి కొన్ని రోజులు గడిస్తే కాని శ్రీలంకలో జనజీవనం కుదుటపడేలా లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.