Telugu Global
National

తృతీయమే.... ప్రత్యామ్నాయమా?

పార్లమెంటు ఎన్నికలలో అటు బీజేపీకి గానీ, ఇటు కాంగ్రెస్ కు గానీ పూర్తి మెజారిటీ రాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తృతీయ ఫ్రంటు మీద పలువురికి ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో పలు పార్టీల నాయకులు రకరకాల ప్రతిపాదనలను తెరమీదకు తెస్తున్నారు.  “ఆలూ లేదు చూలూ లేదు…. కొడుకు పేరు సోమలింగం” అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కొందరు నాయకులు. మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఈ కోవకే చెందుతాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాహుల్ […]

తృతీయమే.... ప్రత్యామ్నాయమా?
X

పార్లమెంటు ఎన్నికలలో అటు బీజేపీకి గానీ, ఇటు కాంగ్రెస్ కు గానీ పూర్తి మెజారిటీ రాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తృతీయ ఫ్రంటు మీద పలువురికి ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో పలు పార్టీల నాయకులు రకరకాల ప్రతిపాదనలను తెరమీదకు తెస్తున్నారు. “ఆలూ లేదు చూలూ లేదు…. కొడుకు పేరు సోమలింగం” అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కొందరు నాయకులు.

మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఈ కోవకే చెందుతాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాహుల్ గాంధీ కంటే చంద్రబాబు బెటర్ ప్రధాని అవుతారని పవార్ వ్యాఖ్యానించారు. ఇది చంద్రబాబును, ఎల్లోమీడియాను ఆనంద పరచవచ్చేమో గానీ, మిగతా పార్టీల నాయకులకు మాత్రం ఆమోదయోగ్యం కాదని అంటున్నారు.

అసలు శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలే వ్యంగ్యంగా చేసినవి అంటున్నారు. ఎందుకంటే తృతీయ ఫ్రంటులో బలమైన నాయకులు మమతా బెనర్జీ, మాయావతి లాంటి వాళ్ళు ఇంకా ముగ్గురు, నలుగురు ఉన్నారు. అయినా వాళ్ళతో పోల్చకుండా చంద్రబాబుతో పోల్చాడంటే….. తృతీయ ఫ్రంట్ లో అతి బలహీన నాయకుడు చంద్రబాబు. అంతకన్నా అద్వానం రాహుల్ అని చెప్పడానికే…. మరో అతి బలహీన నాయకుడైన చంద్రబాబుతో పోల్చాడని అంటున్నారు.

ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో బాబు పక్షాన ప్రచారానికి వచ్చిన నేతలు ఇప్పుడు చంద్రబాబుతో అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కారణం ఏపీ ఎన్నికలలో టీడీపీకి ఓటమి తప్పదని వారు భావించడమేనని అంటున్నారు.

ఒకవేళ లోక్ సభలో హంగ్ వాతావరణం ఏర్పడి ప్రాంతీయ పార్టీలు కీలకంగా వ్యవహరించే పరిస్థితి ఏర్పడితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ ప్రధాని పదవి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగానే ఉంటారు. యూపీలో ఆశాజనకమైన సీట్లు లభిస్తే అటు మాయావతి కూడా పోటీలో ఉంటారు.

అన్నీ సానుకూలంగా జరిగితే ప్రధాని పీఠం అధిరోహించాలన్న కోరిక బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు కూడా బలంగానే ఉంది. ఇక ఎన్నికలకు ముందు నుంచే తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పాట పాడుతున్నారు. కాలం కలిసి వస్తే దేశానికి సారథ్యం వహించాలనీ ఆయనా బలంగానే కోరుకుంటున్నారు.

వీరంతా ఈసారి ఎన్నికలలో సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నవారేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈసారి ఏపీలో ఫ్యాన్ గాలి జోరుగానే ఉంటుందనే మాటలు వినిపిస్తున్న తరుణంలో టీడీపీకి కొన్ని ఎంపీ సీట్లు రావడం కూడా అనుమానమనే అంటున్నారు.

మరి పోటీలో బలంగా ఉన్న ఉత్తరాది నేతలు చంద్రబాబును ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో చంద్రబాబు బలం చాటగలిగితే ఢిల్లీలో పలుకుబడి సాధించే అవకాశం ఉంటుంది. మరి చంద్రబాబుకు ఆ అదృష్టం ఉందా?

First Published:  28 April 2019 4:32 AM IST
Next Story