మళ్లీ ఒక అక్షరం తో.... నాని
వరుసగా రెండు డిజాస్టర్ లను అందుకున్న నాని ఎట్టకేలకు ‘జెర్సీ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాని ఇప్పటికే తన మొదటి సినిమా ‘అష్టాచమ్మా’ కి దర్శకత్వం వహించిన ఇంద్రగంటి మోహనకృష్ణ తో మరొక సినిమా సైన్ చేసిన సంగతి తెలిసిందే. మల్టీస్టారర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో నాని, సుధీర్ బాబు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తాజా […]
వరుసగా రెండు డిజాస్టర్ లను అందుకున్న నాని ఎట్టకేలకు ‘జెర్సీ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాని ఇప్పటికే తన మొదటి సినిమా ‘అష్టాచమ్మా’ కి దర్శకత్వం వహించిన ఇంద్రగంటి మోహనకృష్ణ తో మరొక సినిమా సైన్ చేసిన సంగతి తెలిసిందే.
మల్టీస్టారర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో నాని, సుధీర్ బాబు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 26 నుంచి మొదలు కావాల్సి ఉంది. కానీ ఏప్రిల్ 29కి వాయిదా పడింది. అదే రోజున టైటిల్ ను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘వి’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. సరికొత్త టైటిల్స్ ను పెట్టడంలో ఇంద్రగంటి మోహనకృష్ణ పేరు ముందే ఉంటుంది. కానీ కేవలం ఒకే ఒక్క లెటర్ తో టైటిల్ పెట్టి అందరి దృష్టిని ఆకర్శించాలనుకుంటున్నారట దర్శక నిర్మాతలు.
నాని నిర్మాతగా మారిన సినిమాకు కూడా ‘అ!’ అని సింగిల్ లెటర్ వచ్చేలాగా టైటిల్ ను పెట్టారు. ఇప్పుడు మళ్లీ అలాంటి సినిమాలో నాని నటించటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ‘వి’ అనే అక్షరానికి అర్థం తెలియాలంటే మరి కొన్నాళ్ళు ఆగాల్సిందే.