32 మంది టచ్‌లో లేరట.... నిజమేనా?
ఏపీలో ఎన్నికల ఫలితాలకు ఇంకా 25 రోజుల సమయం ఉంది. కానీ ఈ లోపు రాజకీయాలు మారే సూచనలు కన్పిస్తున్నాయి. ఈనెల 22న చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశాలు నిర్వహించారు. అయితే ఈ మీటింగ్‌కు 32 మంది అభ్యర్ధులు డుమ్మా కొట్టారు. లేటుగానైనా ఈ విషయం ఇప్పుడు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉండవల్లి ప్రజావేదికలో ఈ సమావేశం జరిగింది. అయితే నియోజక వర్గాల వారీగా సమాచారం సేకరించారు. తీరా ఇప్పుడు చూస్తే 32 మంది క్యాండిడేట్లు […]
ఏపీలో ఎన్నికల ఫలితాలకు ఇంకా 25 రోజుల సమయం ఉంది. కానీ ఈ లోపు రాజకీయాలు మారే సూచనలు కన్పిస్తున్నాయి. ఈనెల 22న చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశాలు నిర్వహించారు. అయితే ఈ మీటింగ్‌కు 32 మంది అభ్యర్ధులు డుమ్మా కొట్టారు. లేటుగానైనా ఈ విషయం ఇప్పుడు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఉండవల్లి ప్రజావేదికలో ఈ సమావేశం జరిగింది. అయితే నియోజక వర్గాల వారీగా సమాచారం సేకరించారు. తీరా ఇప్పుడు చూస్తే 32 మంది క్యాండిడేట్లు రాలేదు.ఆ నియోజకవర్గం నాయకులు రాలేదు. కనీసం ఎందుకు రావడం లేదో సమాచారం కూడా ఇవ్వలేదట.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంకి చెందిన తోట త్రిమూర్తులతో పాటు ఆ జిల్లాకు చెందిన ఇద్దరు ముగ్గురు నేతలు ఈ సమావేశానికి డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం లేదని వీరంతా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. తూతూమంత్రంగా జరిగే సమీక్షలతో లాభం లేదని వీరంతా డుమ్మా కొట్టినట్లు సమాచారం.
మరోవైపు వీరు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్లు వార్తలు విన్పిస్తున్నాయి. వైసీపీ నేతలకు వీరు టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం అందుతోంది. దీంతో ఈవిషయం తెలిసిన చంద్రబాబు…వారిని కాంటాక్ట్ కావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
అందుకే తమ పార్టీదే గెలుపు అని లీకులు వదులుతున్నారని….గెలిచే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ వీడకుండా చూడాలని సీనియర్ నేతలను కోరినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలకు టచ్‌లోకి ఏఏ నేతలు వెళ్తున్నారో తెలుసుకోవాలని సూచించినట్లు సమాచారం.