ఓడిపోతాననే టెన్షన్‌లో బాలయ్య..!
ఏపీలో ఈ సారి ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. పోలింగ్ ముగిసిన తర్వాత చాలా మంది విశ్లేషకులు వైసీపీ వైపే మొగ్గు ఉన్నట్లు చెప్పారు. పోలింగ్ సరళి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటునే చూపించింది. దీంతో చాలా మంది అభ్యర్థులు పోలింగ్ సరళిని సమీక్షించే పనిలో పడ్డారు. గత ఎన్నికల్లో హిందూపురం నుంచి గెలిచిన బాలయ్య తిరిగి రెండో సారి అక్కడి నుంచే పోటీ చేశారు. అయితే ఈ సారి తాను గెలుస్తానా లేదా అనే సమీక్ష నిర్వహించారట..! […]
ఏపీలో ఈ సారి ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. పోలింగ్ ముగిసిన తర్వాత చాలా మంది విశ్లేషకులు వైసీపీ వైపే మొగ్గు ఉన్నట్లు చెప్పారు. పోలింగ్ సరళి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటునే చూపించింది. దీంతో చాలా మంది అభ్యర్థులు పోలింగ్ సరళిని సమీక్షించే పనిలో పడ్డారు.
గత ఎన్నికల్లో హిందూపురం నుంచి గెలిచిన బాలయ్య తిరిగి రెండో సారి అక్కడి నుంచే పోటీ చేశారు. అయితే ఈ సారి తాను గెలుస్తానా లేదా అనే సమీక్ష నిర్వహించారట..! రెండు రోజుల పాటు హిందూపురంలో ఉన్న బాలకృష్ణ కార్యకర్తలు, పార్టీ నేతలతో కలిసి బూత్‌ల వారీగా జరిగిన పోలింగ్‌ను సమీక్షించారని తెలుస్తోంది.
మండలాలు, గ్రామాలు, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ ఎటువైపు జరిగిందనే విషయాన్ని తెలుసుకున్నారట. అయితే చాలా చోట్ల తనకు వ్యతిరేకంగా పోలింగ్ జరిగిందని తెలుసుకొని టెన్షన్‌లో పడ్డారట. సమావేశంలో నాయకులు చెప్పినదాన్ని బట్టి 77.60 శాతం పోలింగ్ జరిగిందంటే దానిలో ఎక్కువగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉండొచ్చని చెప్పారట. దీంతో సమావేశంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.