Telugu Global
National

పసుపు రైతు @ వారణాసి

నిజామాబాద్ లో భారీ సంఖ్యలో నామినేషన్లు వేసి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె కవితను గడగడలాడించిన పసుపు, ఎర్రజొన్న రైతులు ఇప్పుడు ప్రధాని మోడీ మీద పోటీకి కూడా సై అంటున్నారు. దాదాపు 50 మందికి పైగా రైతులు వారణాసిలో నామినేషన్లు వేసేందుకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు. ఇది ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. నిజామాబాద్ లో రైతులు నామినేషన్లు వేసినపుడు ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయడంలోనూ, పసుపు, ఎర్రజొన్న రైతులకు […]

పసుపు రైతు @ వారణాసి
X

నిజామాబాద్ లో భారీ సంఖ్యలో నామినేషన్లు వేసి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె కవితను గడగడలాడించిన పసుపు, ఎర్రజొన్న రైతులు ఇప్పుడు ప్రధాని మోడీ మీద పోటీకి కూడా సై అంటున్నారు.

దాదాపు 50 మందికి పైగా రైతులు వారణాసిలో నామినేషన్లు వేసేందుకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు. ఇది ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. నిజామాబాద్ లో రైతులు నామినేషన్లు వేసినపుడు ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయడంలోనూ, పసుపు, ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించడంలోనూ విఫలమయ్యారని ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీదా, అటు కవిత మీదా ఆరోపణలు చేశారు.

అప్పడు సీఎం కేసీఆర్ ఈ అంశం మీద ఎలాంటి వ్యాఖ్యానాలు చేయనప్పటికీ, కవిత మాత్రం రైతుల ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండించారు. తాను గత ఐదేళ్లు పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఢిల్లీలో అనేక ప్రయత్నాలు చేశానని చెప్పుకుంటూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వమే స్పందించడం లేదని వివరించారు.

అప్పుడు నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి డీఎస్ తనయుడు అర్వింద్ రైతుల పక్షాన మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఇప్పుడు సీన్ మారిపోయింది.

పసుపు బోర్డు ఏర్పాటు కాకపోవడానికి బీజేపీయే కారణమని రైతులు మండిపడుతున్నారు. అందుకే నిజామాబాద్ లో చేసినట్లుగానే వారణాసిలో కూడా భారీ సంఖ్యలో నామినేషన్లు వేసి సమస్యను జాతీయస్థాయికి తీసుకు వెళతామని చెబుతున్నారు. కానీ, అర్వింద్ మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. అసలు వారణాసికి వెళ్తామని అంటున్నవారు రైతులే కాదని అంటున్నారు. వారంతా టీఆర్ఎస్ కార్యకర్తలని, ఎన్నికలపుడు నిజామాబాద్ లో ఆ పార్టీ పక్షాననే పని చేశారని చెబుతున్నారు.

ఇది కావాలని ఆడుతున్ననాటకమని కొట్టి పడేస్తున్నారు. నిజామాబాద్ లో రైతులు నామినేషన్లు వేసినపుడు తాము వారిని గౌరవించామని, ఇప్పుడు బీజేపీ నేతలు మాత్రం రైతులపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. ఇంతకీ తన మీద పోటీకి వస్తున్న నిజామాబాద్ పసుపు రైతుల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏమంటారో చూడాలి. ఇది సరే… అదే నిజామాబాద్ లో ఎర్రజొన్న రైతుల గిట్టుబాటు ధర ఏమైనట్టో మరి!

First Published:  25 April 2019 11:31 PM GMT
Next Story