వాయిదాపడిన జాతీయ సినిమా అవార్డులు
ఈసారి జాతీయ సినిమా అవార్డులు ఎవరికి వస్తాయి అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం జాతీయ అవార్డు అందుకున్న విన్నర్ ల జాబితాను ఏప్రిల్ లో విడుదల చేసి అవార్డులు మే లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈసారి కూడా అవార్డుల విన్నర్ లను ఏప్రిల్ 22 సోమవారం నాడు విడుదల చేయాల్సింది. కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారు ఈ విడుదలను మే కి వాయిదా వేశారు. ప్రస్తుతం […]
ఈసారి జాతీయ సినిమా అవార్డులు ఎవరికి వస్తాయి అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం జాతీయ అవార్డు అందుకున్న విన్నర్ ల జాబితాను ఏప్రిల్ లో విడుదల చేసి అవార్డులు మే లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు.
ఈసారి కూడా అవార్డుల విన్నర్ లను ఏప్రిల్ 22 సోమవారం నాడు విడుదల చేయాల్సింది. కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారు ఈ విడుదలను మే కి వాయిదా వేశారు.
ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న జనరల్ ఎలక్షన్స్ వలన నేషనల్ సినిమా అవార్డుల ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అవార్డులను ఎన్నికల సమయంలో ప్రకటించడం ఎలక్షన్ కమిషన్ రూల్స్ కి వ్యతిరేకం.
అందుకే జాతీయ సినిమా అవార్డులను మే 9 తరువాత ప్రకటించనున్నారు. ఇక ఈ అవార్డులలో తెలుగు సూపర్ హిట్ సినిమాలు ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘కేరాఫ్ కంచరపాలం’, ‘గీతగోవిందం’ మరియు ‘చిలసౌ’ సినిమాలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.