కోమటిరెడ్డి మరో బ్రదర్ పొలిటికల్ ఎంట్రీ !
కోమటిరెడ్డి బ్రదర్స్. నల్గొండ రాజకీయాల్లోనే కాదు… తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక నేతలు… కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఈ ఇద్దరూ బ్రదర్సే ఇప్పటివరకూ రాజకీయాల్లోకి వచ్చారు. ఒకరు ఎమ్మెల్యేగా…మరొకరు ఎంపీగా ఇన్నాళ్లు ఉన్నారు. గత ఎన్నికల్లో మునుగోడు నుంచి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వెంకటరెడ్డి నల్గొండలో ఓడిపోయారు. అయితే భువనగిరి ఎంపీగా వెంకటరెడ్డి పోటీ చేశారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. నల్గొండ రాజకీయాల్లో ఈ ఇద్దరి బ్రదర్స్‌కి తోడు మరో సోదరుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని […]
కోమటిరెడ్డి బ్రదర్స్. నల్గొండ రాజకీయాల్లోనే కాదు… తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక నేతలు… కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఈ ఇద్దరూ బ్రదర్సే ఇప్పటివరకూ రాజకీయాల్లోకి వచ్చారు. ఒకరు ఎమ్మెల్యేగా…మరొకరు ఎంపీగా ఇన్నాళ్లు ఉన్నారు. గత ఎన్నికల్లో మునుగోడు నుంచి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వెంకటరెడ్డి నల్గొండలో ఓడిపోయారు. అయితే భువనగిరి ఎంపీగా వెంకటరెడ్డి పోటీ చేశారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
నల్గొండ రాజకీయాల్లో ఈ ఇద్దరి బ్రదర్స్‌కి తోడు మరో సోదరుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి. మొన్నటి వరకూ ప్రభుత్వ ఉద్యోగి. ఆర్టీఏ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు. ఇటీవల పదవీ విరమణ చేశారు. నల్గొండలో ఉంటున్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ సొంత మండలం నార్కెట్‌పల్లి. ఇక్కడి నుంచి ఈసారి మోహన్‌రెడ్డిని జడ్పీటీసీగా పోటీ చేయించాలని ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికే నార్కెట్‌పల్లి మండలంలోని ఓ ఆలయానికి మోహన్‌రెడ్డి ధర్మకర్త. అంతేకాకుండా చాలా పనులు చేశారు. లోకల్‌గా పరిచయాలు ఉన్నాయి.
నల్గొండలో అత్యధికంగా 31 జడ్పీటీసీలు ఉన్నాయి. అత్యధికంగా ఇక్కడ సీట్లు గెలిచి ఈ జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోమటిరెడ్డి బ్రదర్స్ కలలు కంటున్నారు. అందుకే తమ సోదరుడు మోహన్‌రెడ్డిని పోటీకి దింపాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ సోదరుడిని జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా ప్రకటించాలని ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలను కోరినట్లు తెలుస్తోంది.