Telugu Global
International

శ్రీలంక బాంబ్ బ్లాస్ట్స్ : ఐసిస్ చెప్పింది ఎంత వరకు నిజం ?

ఈస్టర్ పండగ రోజు శ్రీలంకలోని చర్చీలు, లగ్జరీ హోటల్స్ లక్ష్యంగా జరిగిన దాడిలో ఇప్పటి వరకు 350 మంది మరణించారు. ఈ ఘోర మారణ హోమం వెనుక ఉన్నది తామేనని నిన్న ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. న్యూజీల్యాండ్‌లో మార్చి 15న ఒక శ్వేతజాతీయుడు జరిపిన జాత్యాహంకార దాడికి ప్రతీకారంగానే శ్రీలంకలో దాడులకు పాల్పడ్డామని స్పష్టం చేసింది. అయితే ఐసిస్ చెప్పింది ఎంత వరకు నిజం..? న్యూజీలాండ్ దాడులకు, శ్రీలంక బాంబు దాడులకు మధ్య సరిగ్గా 5 వారాల […]

శ్రీలంక బాంబ్ బ్లాస్ట్స్ : ఐసిస్ చెప్పింది ఎంత వరకు నిజం ?
X

ఈస్టర్ పండగ రోజు శ్రీలంకలోని చర్చీలు, లగ్జరీ హోటల్స్ లక్ష్యంగా జరిగిన దాడిలో ఇప్పటి వరకు 350 మంది మరణించారు. ఈ ఘోర మారణ హోమం వెనుక ఉన్నది తామేనని నిన్న ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. న్యూజీల్యాండ్‌లో మార్చి 15న ఒక శ్వేతజాతీయుడు జరిపిన జాత్యాహంకార దాడికి ప్రతీకారంగానే శ్రీలంకలో దాడులకు పాల్పడ్డామని స్పష్టం చేసింది. అయితే ఐసిస్ చెప్పింది ఎంత వరకు నిజం..?

న్యూజీలాండ్ దాడులకు, శ్రీలంక బాంబు దాడులకు మధ్య సరిగ్గా 5 వారాల సమయం ఉంది. అంటే ఆ దాడి జరిగిన వెంటనే 45 రోజుల్లో ఇంత ఘోరానికి పాల్పడటం సాధ్యమా..? ఇదంతా ప్రతీకార దాడేనా..? అంటూ భారత నిఘా అధికారులు కొట్టిపారేస్తున్నారు.

శ్రీలంకలో బాంబు దాడికి పాల్పడింది నేషనల్ తౌహీద్ జమాతే (ఎన్టీజే) అనే సంస్థ అని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీని వెనుక ఐసిస్ ఉన్న మాట వాస్తవమే కాని ఇది ప్రతీకార దాడి కాదని.. దాడులకు 3 నెలల ముందు నుంచి ప్రణాళిక రచించిందని.. అయితే చెప్పుకోవడానికి ఒక సాకు దొరికిందని నిఘా అధికారులు చెబుతున్నారు.

శ్రీలంకలో దాడులకు ఎన్టీజే ప్రణాళిక రచిస్తున్నట్లు భారత్, అమెరికాకు చెందిన నిఘా వర్గాలు ఎప్పుడో శ్రీలంకకు చెప్పాయి. కానీ శ్రీలంక మాత్రం ఈ నిఘా వర్గాల హెచ్చరికలను పట్టించుకోలేదు. అంతే కాక ఐసిస్ తమ దేశంలో ఉనికిలోనే లేదని చెప్పారు. కాని ఐసిస్ ప్రోద్బలంతోనే ఎన్టీజే ఈ దాడులకు పాల్పడిందనేది నిన్నటి ప్రకటన తర్వాత స్పష్టమైంది.

ఆత్మాహుతి సభ్యుల ఎంపిక, బాంబుల తరలింపు వంటి ప్రక్రియలకు 3 నుంచి 4 నెలల నుంచి ప్రణాళికలు రచించారని.. కానీ న్యూజీలాండ్ ఘటనకు ప్రతీకారం అని చెప్పుకుంటున్నారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏదేమైనా శ్రీలంక ప్రభుత్వ అలసత్వం కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోవడం నిజంగా విచారకరం.

First Published:  25 April 2019 12:32 AM IST
Next Story