గులాబీ తమ్ముళ్లకు ఏమైంది? ఒక్కరూ కనిపించడం లేదు !
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు, మార్కుల తారుమారు, పాస్ ఫెయిల్ వ్యవహారం తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇంటర్ బోర్డు గోల్ మాల్ వ్యవహారాలపై రోజుకో కథనం బయటకు వస్తోంది. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వ్యవహారశైలి వివాదస్పదంగా మారింది. ఇంటర్ బోర్డు లీలలపై ఇంటర్ బోర్డు కార్యదర్శి తూతూ మంత్రం ప్రకటనలు ఫలించలేదు. ఇంకా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఓ వైపు త్రిసభ్య కమిటీ విచారణ జరుగుతోంది. అయితే తప్పు ఎక్కడ జరిగింది అనేది మాత్రం […]
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు, మార్కుల తారుమారు, పాస్ ఫెయిల్ వ్యవహారం తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇంటర్ బోర్డు గోల్ మాల్ వ్యవహారాలపై రోజుకో కథనం బయటకు వస్తోంది. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వ్యవహారశైలి వివాదస్పదంగా మారింది.
ఇంటర్ బోర్డు లీలలపై ఇంటర్ బోర్డు కార్యదర్శి తూతూ మంత్రం ప్రకటనలు ఫలించలేదు. ఇంకా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఓ వైపు త్రిసభ్య కమిటీ విచారణ జరుగుతోంది. అయితే తప్పు ఎక్కడ జరిగింది అనేది మాత్రం ఇంకా ఎవరూ చెప్పలేకపోతున్నారు.
ఇంటర్ బోర్డులో అశోక్, సునీల్ మధ్య ఆధిపత్య పోరు వల్ల ఇదంగా జరిగిందా? గ్లోబల్ ఎరీనా నిర్లక్ష్యం వల్ల ఈ సమస్యలు వచ్చాయా? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే గ్లోబల్ ఎరీనా వల్లే ఈ తప్పులు దొర్లాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంటర్ బోర్డు కూడా ఏర్పాట్లలో వైఫల్యం చెందింది.
మార్కుల్లో తప్పులు దొర్లినప్పుడు వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సింది. కానీ ఇంటర్ బోర్డు పట్టించుకోలేదు. మరోవైపు ఈ వ్యవహారంలో ప్రతిపక్షాల విమర్శలకు గులాబీ దళం ముఖ్యంగా టీఆర్ఎస్ అగ్రనేతల నుంచి స్పందన లేదు. కనీసం విమర్శలకు పార్టీ తరపున ఏ అధికార ప్రతినిధి, నేత కూడా సమాధానం చెప్పడం లేదు.
గులాబీ బాస్ నుంచి క్లియరెన్స్ రాకపోవడం వల్లే ఇదంగా జరుగుతుందా? లేక తప్పులు అధికారుల లెవల్లో జరగడంతో ఏం చేయాలో తెలియడం లేదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
మొత్తానికి త్రిసభ్య కమిటీ రిపోర్టు ప్రకారం చర్యలు ఉంటాయని తెలుస్తోంది. ఆ రిపోర్టు వచ్చిన తర్వాతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమాచారం. అప్పటివరకూ గులాబీ దళం నుంచి ఎలాంటి రియాక్షన్లు ఉండవని తెలుస్తోంది. మొత్తానికి ఇంటర్ బోర్డు వ్యవహారం…. గులాబీ పార్టీకి చేయాల్సినంత డ్యామేజీ మాత్రం జరిగింది. దీన్ని ఎలా కవర్ చేస్తారో చూడాలి.