రష్మిక పై ప్రాంక్ ప్లే చేసిన దర్శకుడు
Telugu Global
Cinema & Entertainment

రష్మిక పై ప్రాంక్ ప్లే చేసిన దర్శకుడు

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ‘చలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న ఈమె గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో టాలీవుడ్ లో నే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. తాజాగా రష్మిక మందన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘గీతగోవిందం’ షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చింది. షూటింగ్ సమయంలో పరశురాం ఆమెపై ప్రాంక్ ప్లే చేశాడని చెప్పుకొచ్చింది. “ఒక రోజు నేను షూటింగ్ […]

రష్మిక పై ప్రాంక్ ప్లే చేసిన దర్శకుడు
X

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ‘చలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న ఈమె గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో టాలీవుడ్ లో నే టాప్ హీరోయిన్ గా మారిపోయింది.

తాజాగా రష్మిక మందన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘గీతగోవిందం’ షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చింది. షూటింగ్ సమయంలో పరశురాం ఆమెపై ప్రాంక్ ప్లే చేశాడని చెప్పుకొచ్చింది.

“ఒక రోజు నేను షూటింగ్ కి కొంచెం ఆలస్యంగా వెళ్లాను. వెళ్ళిన తరువాత ఒక్కరు కూడా నాతో మాట్లాడలేదు. నాకు చాలా బాధగా అనిపించి ఏం చేయాలో అర్థం కాక ఒక మూలకి వెళ్లి కూర్చొని ఏడవడం మొదలు పెట్టాను. అప్పుడు దర్శకుడు పరశురామ్ వచ్చి ఇదంతా ప్రాంక్ అని చెప్పారు. కానీ మళ్లీ నార్మల్ అవ్వడానికి మాత్రం నాకు చాలా సమయం పట్టింది” అని చెప్పింది రష్మిక.

ఇక రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా మే 31న విడుదల కానుంది.

First Published:  22 April 2019 11:18 PM
Next Story