ఐపీఎల్ -12 ఫైనల్ వేదికగా హైదరాబాద్
మే 12న రాజీవ్ స్టేడియంలో టైటిల్ ఫైట్ విశాఖలో ఎలిమినేటర్, క్వాలిఫైయర్ -2 పోటీలు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఐపీఎల్ ఫైనల్ వేదికగా…హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియాన్ని ..ఐపీఎల్ బోర్డు ఎంపిక చేసింది. వాస్తవానికి..మే 12న చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఐపీఎల్ ఫైనల్స్ జరగాల్సి ఉంది. అయితే..తమిళనాడు క్రికెట్ సంఘం… ప్రభుత్వం నుంచి మూడు స్టాండ్లకు అనుమతి సాధించలేకపోడంతో… అక్కడ జరగాల్సిన ఫైనల్స్ ను హైదరాబాద్ కు కేటాయించినట్లు బీసీసీఐ ప్రకటించింది. విశాఖలో […]
- మే 12న రాజీవ్ స్టేడియంలో టైటిల్ ఫైట్
- విశాఖలో ఎలిమినేటర్, క్వాలిఫైయర్ -2 పోటీలు
దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఐపీఎల్ ఫైనల్ వేదికగా…హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియాన్ని ..ఐపీఎల్ బోర్డు ఎంపిక చేసింది.
వాస్తవానికి..మే 12న చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఐపీఎల్ ఫైనల్స్ జరగాల్సి ఉంది. అయితే..తమిళనాడు క్రికెట్ సంఘం… ప్రభుత్వం నుంచి మూడు స్టాండ్లకు అనుమతి సాధించలేకపోడంతో… అక్కడ జరగాల్సిన ఫైనల్స్ ను హైదరాబాద్ కు కేటాయించినట్లు బీసీసీఐ ప్రకటించింది.
విశాఖలో రెండుమ్యాచ్ లు…
మే 8న జరిగే ఎలిమినేటర్, మే 10న జరిగే క్వాలిఫైయర్ -2 మ్యాచ్ లకు విశాఖలోని ఆంధ్ర క్రికెట్ సంఘం స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ వివరాలను బీసీసీఐ పాలకమండలి చైర్మన్ వినోద్ రాయ్ అధికారికంగా ప్రకటించారు.
తమిళనాడు క్రికెట్ సంఘం మూడు గేట్లకు అనుమతి సంపాదించలేకపోడంతో…ఐపీఎల్ బోర్డు కోట్లాదిరూపాయల మేర గేట్ మనీ నష్టపోవాల్సి వస్తుందని..ఈ కారణంగానే హైదరాబాద్ ను ఎంపిక చేసినట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి.