పెదవి విప్పండి పవన్ గారూ....
పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోకి దూకూడు మీద వచ్చాడు. ఇటీవల జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో తమ అభ్యర్దులను ఎన్నికల బరిలో దించారు. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలలోను పర్యాటించి ఎన్నికల సభలలో ప్రసంగించారు. మధ్య మధ్యలో విలేఖరుల సమావేశాలు పెట్టి అధికార తెలుగుదేశం పార్టీని కొద్దిగా, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అతిగా విమర్శించారు. తన పార్టీ జనసేనకు మద్దతుగా జాతీయ నాయకురాలు మాయావతినీ రప్పించారు. ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి పోలింగ్ ముగిసే […]
పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోకి దూకూడు మీద వచ్చాడు. ఇటీవల జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో తమ అభ్యర్దులను ఎన్నికల బరిలో దించారు. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలలోను పర్యాటించి ఎన్నికల సభలలో ప్రసంగించారు. మధ్య మధ్యలో విలేఖరుల సమావేశాలు పెట్టి అధికార తెలుగుదేశం పార్టీని కొద్దిగా, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అతిగా విమర్శించారు.
తన పార్టీ జనసేనకు మద్దతుగా జాతీయ నాయకురాలు మాయావతినీ రప్పించారు. ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ ఎక్కడో ఒక చోట మాట్లాడుతూనే ఉన్నారు పవన్. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి ఆదివారం వరకూ ఆయన ఎక్కడా నోరు విప్పలేదు, పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన పార్టీ జనసేనలోను, ఆంధ్రప్రదేశ్ ప్రజలలోను ఇదే చర్చనీయంశంగా మారింది.
పోలింగ్ ముగిసిన తర్వాత ఓటింగ్ సరళిపై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఎన్నికల సంఘం తీరు తెన్నులపై మండిపడ్డారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి కూడా చంద్రబాబు పైన, తెలుగుదేశం పార్టీపైన విమర్శలు చేసారు. ప్రభుత్వాధికారులతో ముఖ్యమంత్రి సమావేశాలు ఏర్పాటు చేయడాన్ని ఖండిచారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీల అధ్యక్షులు పోలింగ్ సరళిపైన, గెలుపోటములపైనా స్పందిస్తున్నారు. అయితే ఆరడుగుల బుల్లెట్ అంటూ దూసుకొచ్చిన పవన్ కల్యాణ్ మాత్రం ఆదివారం వరకూ మాట పలుకు లేకుండా మిన్నకుండిపోయారు. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తనను కనికరించలేదా అని పవన్ కల్యాణ్ లోలోపల భయపడుతున్నారేమోనని జనసేన నాయకులు అంటున్నారు.
తాను అధికారంలోకి రాకపోయిన కింగ్ మేకర్ అయినా అవుతానని పవన్ కల్యాణ్ గంపెడు ఆశాలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకపోవడంతో పవన్ కల్యాణ్ పెదవి విప్పడం లేదని ఆయన అనుచర గణం అంచనా వేస్తోంది.
అయితే వైసీపీ నాయకులు మాత్రం పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో ఉన్న ఒప్పందం ప్రకారం ఆయన పని ఎన్నికల రోజుతోనే అయిపోయింది కాబట్టి ఇక ఆయన మాట్లాడేది ఏమీ లేదు కాబట్టి మౌనంగా ఉంటున్నాడని అంటున్నారు.
అయితే ఆదివారం నాడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ తరపున పోటీచేసిన అభ్యర్ధులతో సమావేశం అయ్యాడు. ఈ సమావేశానికి చాలామంది రాలేదు. ఈ సమావేశంలో సీరియస్ రాజకీయ చర్చలు ఏవీ జరగలేదని సమాచారం.