Telugu Global
National

రోజుకో మలుపు తిరుగుతున్న 1,381 కిలోల బంగారం కథ

నాలుగు రోజుల క్రితం తమిళనాడులో దొరికిన 1,381 కిలోల బంగారం కథ రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల నేపధ్యంలో డబ్బులు తరలిస్తున్నారనే అనుమానంతో పోలీసులు కొన్ని వాహనాలను ఆపి తనిఖీలు చేస్తుంటే… ఒక డొక్కు వ్యాన్‌లో తరలిస్తున్న వందల కిలోల బంగారం బయటపడింది. అది ప్రైవేట్‌ వ్యాన్‌. పైగా పరమ డొక్కుది. ఆ బంగారం తాలూకూ పత్రాలు కూడా వాళ్ళ వద్ద లేవు. దాంతో పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇక్కడి నుంచి కథ […]

రోజుకో మలుపు తిరుగుతున్న 1,381 కిలోల బంగారం కథ
X

నాలుగు రోజుల క్రితం తమిళనాడులో దొరికిన 1,381 కిలోల బంగారం కథ రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల నేపధ్యంలో డబ్బులు తరలిస్తున్నారనే అనుమానంతో పోలీసులు కొన్ని వాహనాలను ఆపి తనిఖీలు చేస్తుంటే… ఒక డొక్కు వ్యాన్‌లో తరలిస్తున్న వందల కిలోల బంగారం బయటపడింది.

అది ప్రైవేట్‌ వ్యాన్‌. పైగా పరమ డొక్కుది. ఆ బంగారం తాలూకూ పత్రాలు కూడా వాళ్ళ వద్ద లేవు. దాంతో పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇక్కడి నుంచి కథ మొదలైంది. ఈ బంగారం టీటీడీదని మీడియాకు సమాచారం లీక్‌ అయింది.

అయితే ఆ బంగారానికి, టీటీడీకి సంబంధం లేదని, ఆ బంగారం గురించి తమకేమీ తెలియదని టీటీడీ అధికారులు మొదట చెప్పారు. అయితే ఆ తరువాత ఆ బంగారం మాదేనని టీటీడీ ప్రకటించింది. టీటీడీ ఈవో కొన్ని కాగితాలు పంపి ఆ బంగారం మాదేనని విడిపించుకొచ్చారు.

ఆ 1,381 కిలోల బంగారాన్ని తరలించే సమయంలో పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ అధికారులు కూడా తగిన ఆధారాలు చూపలేకపోయారు. ఏమాత్రం పోలీసు భద్రత లేకుండా సుమారు 400 కోట్ల రూపాయల బంగారాన్ని నలుగురు వ్యక్తులు తీసుకువెళ్ళడం వెనుక పెద్ద మిస్టరీనే కనిపిస్తోంది. కనీస భద్రత లేకుండా, అధికారిక పత్రాలు లేకుండా శ్రీవారి బంగారాన్ని ఇలా తరలించడం వెనుక పెద్ద కుట్రే ఉన్నట్లు కనిపిస్తోంది.

ఒక వేళ ఒక బ్యాంక్‌ నుంచి ఈ బంగారాన్ని మరో బ్యాంక్‌కు తరలిస్తుంటే అందుకు తగిన ఆధారాలు వాళ్ళ వద్ద ఉండాలి. అలాంటివి ఏమీ లేవు. పైగా 1,381 కిలోల బంగారాన్ని టీటీడీ ఈవోకి తెలియకుండా తరలించడం సాధ్యమేనా? అన్నీ అనుమానాలే. పెద్దలెవరో ఈ దేవుడి సొమ్మును కాజేసే ప్రయత్నం అయినా అయి ఉండాలి… లేదా వాళ్ళ బంగారాన్ని తరలిస్తూ దొరికిపోతే…. దానికి టీటీడీ ముద్ర వేసే ప్రయత్నం అయినా అయి ఉండాలని ప్రజలు భావిస్తున్నారు.

అయితే ఈ మొత్తం వ్యవహారం పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం శాఖా పరమైన ప్రాధమిక విచారణకు ఆదేశించారు. మంగళవారం లోగా ప్రాధమిక నివేదిక అందనుంది. రెండు మూడు రోజుల్లో అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

First Published:  22 April 2019 11:15 AM IST
Next Story