Telugu Global
NEWS

బాబు గారూ.... ఇదేమి తీరు సారూ !

ఏపీ సీఎం చంద్రబాబు రోజురోజుకూ చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నారంటున్నారు తెలుగు తమ్ముళ్లు. రెండు దఫాలుగా ఆయన దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజకీయ నేతగా 40 ఏళ్ల అనుభవం ఉందని…. ఆ విషయాన్ని ఆయనే ఎన్నోసార్లు ఘనంగా ప్రకటించుకున్నారు కూడా. కానీ, ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఆయన మాట్లాడుతున్న తీరును రాజకీయ ప్రత్యర్ధులకు, రాజకీయ పండితులకే కాదు…. తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి కూడా ఆశ్చర్యం కలుగిస్తోంది. […]

బాబు గారూ.... ఇదేమి తీరు సారూ !
X

ఏపీ సీఎం చంద్రబాబు రోజురోజుకూ చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నారంటున్నారు తెలుగు తమ్ముళ్లు. రెండు దఫాలుగా ఆయన దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు.

రాజకీయ నేతగా 40 ఏళ్ల అనుభవం ఉందని…. ఆ విషయాన్ని ఆయనే ఎన్నోసార్లు ఘనంగా ప్రకటించుకున్నారు కూడా. కానీ, ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఆయన మాట్లాడుతున్న తీరును రాజకీయ ప్రత్యర్ధులకు, రాజకీయ పండితులకే కాదు…. తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి కూడా ఆశ్చర్యం కలుగిస్తోంది.

ఒకసారి ఈవీఎంలు సరిగా పని చేయడం లేదంటారు. మళ్లీ ఆయనే టీడీపీ విజయం సాధిస్తుందని ఢంకా బజాయిస్తారు. పక్క రాష్ట్రాలలో ప్రచారానికి వెళ్లి అక్కడ వాళ్లకు సంబంధం లేని ఏపీ విషయాలను ఏకరువు పెడతారు. ఇక్కడ కాంగ్రెస్ ఆయనకు అల్లమే. అక్కడ మాత్రం ఎందుకో విచిత్రంగా బెల్లం అవుతుంది.

తాను ఏం మాట్లాడినా పరవాలేదు. ఇంకెవరన్నా కాంగ్రెస్ పేరెత్తితే మాత్రం వాళ్లను ఏపీ ద్రోహులుగా చిత్రీకరిస్తారు. చంద్రబాబు మానసిక స్థితిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ఏపీ ప్రజలు తలలు పట్టుకుంటున్నారని అంటున్నారు.

ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆయనే ముఖ్యమంత్రి. ఇందులో కాదనేందుకు ఏమీ లేదు. రాష్ట్ర ప్రజలకు అత్యవసరమయ్యే
అంశాల మీద అధికారులకు సూచనలు, సలహాలు ఇవ్వడంలో ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఉన్నతాధికారులందరినీ పిలిపించుకుని పూర్తిస్థాయి సమీక్షలు జరపడం సరియైంది కాదనేది నిపుణుల అభిప్రాయం. అలాగే రహస్య జీవోలు విడుదల చేయడమూ పద్ధతి కాదని, ఇది నైతికత అనిపించుకోదని వారు చెబుతున్న మాట.

చంద్రబాబు నాయుడు కానీ, ఆయన పుత్రరత్నం లోకేష్ కానీ ఈ విషయాలను పట్టించుకోవడం లేదంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ సమీక్షలు జరిపితే తప్పు లేదా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఏపీ మీద ఈసీ కుట్రలు పన్నుతోందని మండిపడుతున్నారు. ఏపీలో నెల రోజుల తరువాత అధికారం మారుతుంది.

టీడీపీ గెలిస్తే సమస్యే లేదు. అప్పటి వరకు ఓపిక పడితే సరిపోతుంది. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ఇప్పటికే రెండోసారి అధికారంలోకి వచ్ఛింది. ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోవడంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత ఎందుకు తడబడుతున్నారో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

తాము అధికారానికి దూరమవుతున్నామనే విషయం బాబుకు మెల్లమెల్లగా అర్థమవుతోందా? అందుకే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు.

ఏది ఏమైనా చంద్రబాబు నాయుడి ప్రస్తుత తీరు మాత్రం రాజకీయ వర్గాల్లోనే కాదు… సామాన్యులలో కూడా గందరగోళాన్ని కలిగిస్తోందని చెబుతున్నారు.

First Published:  22 April 2019 2:39 AM IST
Next Story