చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన మమతా బెనర్జీ!
ఏపీ ఎన్నికల వేళ వచ్చి చంద్రబాబు తరఫున ప్రచారం సైతం చేసి వెళ్లిన మమతా బెనర్జీ తీరా ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అంటూ మాట్లాడటం ఆసక్తిదాయకంగా మారింది. ఒకవైపు చంద్రబాబు నాయుడేమో రాహుల్ గాంధీ వెంట తిరుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ కూటమిలో మెంబర్ అయినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారాయన. కర్ణాటకకు వెళ్లి కాంగ్రెస్, జేడీఎస్ ల తరఫున బాబు ప్రచారం చేశారు. అధికారం దక్కేది కాంగ్రెస్ కూటమి కే అన్నట్టుగా బాబు మాట్లాడుతూ ఉన్నారు కూడా. బీజేపీ వ్యతిరేక […]
ఏపీ ఎన్నికల వేళ వచ్చి చంద్రబాబు తరఫున ప్రచారం సైతం చేసి వెళ్లిన మమతా బెనర్జీ తీరా ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అంటూ మాట్లాడటం ఆసక్తిదాయకంగా మారింది. ఒకవైపు చంద్రబాబు నాయుడేమో రాహుల్ గాంధీ వెంట తిరుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ కూటమిలో మెంబర్ అయినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారాయన. కర్ణాటకకు వెళ్లి కాంగ్రెస్, జేడీఎస్ ల తరఫున బాబు ప్రచారం చేశారు.
అధికారం దక్కేది కాంగ్రెస్ కూటమి కే అన్నట్టుగా బాబు మాట్లాడుతూ ఉన్నారు కూడా. బీజేపీ వ్యతిరేక పక్షాలు అన్నీ కాంగ్రెస్ తో జతకూడుతాయనేది చంద్రబాబు నాయుడి లెక్క. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి మమతా బెనర్జీ ఫెడరల్ ఫ్రంట్ అనడం ఆసక్తిదాయకంగా మారింది.
కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారాన్ని సంపాదించుకుంటుందని మమత అంటున్నారు. ప్రధానిగా ఎవరుండాలనే అంశం మీద కూడా ఫెడలర్ ఫ్రంటే నిర్ణయం తీసుకుంటుందని ఆమె వ్యాఖ్యానించారు. తనతో బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలు టచ్లో ఉన్నాయని ఆమె అన్నారు.
చంద్రశేఖర్ రావు, మాయావతి , అఖిలేష్ యాదవ్.. వంటి వాళ్లంతా తనకు టచ్లో ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది లేదని, ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆమె చెప్పుకొచ్చారు. కొన్నాళ్ల కిందట కేసీఆర్ వెళ్లి మమతను ఈ విషయంలో కలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె ఇలా స్పందించారు.
కేంద్రంలో ఏర్పడే కూటమిలో కేసీఆర్, జగన్ లాంటి వాళ్లకు సంబంధాలు ఉండకూడదనేది చంద్రబాబు కోరిక. ఆ విషయాన్నే ఆయన చెప్పుకుంటూ ఉన్నారు. అయితే బాబుకు ఝలక్ ఇచ్చేలా ఉంది మమతా బెనర్జీ స్పందన.